VDKola : రాజావారు రాణి గారు (Raja Vaaru Rani Gaaru) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రవి కిరణ్ కోలా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాకి కథ అందిస్తూ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నాడు రవి కిరణ్.
ఇలా జరుగుతున్న తరుణంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో రవి కిరణ్ కోలా సినిమా చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత ఆ వార్తలు నిజమే అంటూ అధికారికంగా కూడా ప్రకటించారు. దాదాపు ఈ ప్రకటన వచ్చి సంవత్సరం పైనే కావస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కే ప్రయత్నం చేయలేదు.
ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రేపు లాంచనంగా ప్రారంభం కాబోతుంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమా పొద్దున్నే 6 గంటలకు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 16వ తారీకు నుంచి జరగనుంది. మహారాష్ట్ర హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది.
#VijayDeverkonda – #Dilraju – #RaviKiranKola
మూవీ పూజా కార్యక్రమం రేపు 6 AM @SVC_official ఆఫీస్లో..
16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్.
మహారాష్ట్ర & #Hyderabad లో మొదటి షెడ్యూల్. #Rowdyjanardhana #VDKOLA #SVC59 @TheDeverakonda pic.twitter.com/QForUhB80h— BIG TV Cinema (@BigtvCinema) October 10, 2025
నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకు ఉంది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒకప్పుడు ఈ బ్యానర్ లో సినిమా చేసిన వల్లే.
రీసెంట్ టైమ్స్ లో దిల్ రాజు చేస్తున్న సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని అందుకోలేదు. ఒక సరైన సక్సెస్ఫుల్ సినిమా కోసం దిల్ రాజు కూడా ఎదురు చూస్తున్నారు. 2025 సంవత్సరం చూస్తే గేమ్ చేంజర్ భారీ లాస్. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొంత మేరకు లాభాలు తీసుకొచ్చి పెట్టింది.
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన తమ్ముడు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. తమ్ముడు సినిమా సక్సెస్ సాధించకపోవడంతో ఎల్లమ్మ పరిస్థితి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ సినిమా ఆ బ్యానర్ నుంచి కూడా బయటికి వెళ్లిపోయింది అనే వార్తలు వినిపించాయి. మొత్తానికి రవి కిరణ్ కోలా పైన అందరికీ మంచి నమ్మకం ఉంది. ఒక్క రవి కిరణ్ సక్సెస్ తో విజయ్ దేవరకొండ దిల్ రాజు ఇద్దరు కూడా సెట్ అయిపోవచ్చు.
Also Read: Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే