Meesala pilla song: డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) నయనతార(Nayanatara) ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu). అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఈ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. వచ్చేయడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుసగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా నుంచి పెద్ద ఎత్తున అప్డేట్లను తెలియజేస్తూ అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి మీసాల పిల్ల (Meesala pilla)అంటూ సాగిపోయే పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోకి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. చిరంజీవి నయనతార మధ్య కొనసాగే ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయటానికి చిత్ర బృందం సిద్ధమయ్యారు అయితే ఈ విషయాన్ని చాలా విభిన్నంగా తెలియజేశారు. ఈ సినిమాలో సంక్రాంతి వస్తున్నాం ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు(Bulli Raju) కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే బుల్లి రాజు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ దగ్గరకు వెళ్లి భీమ్స్ గారు మంచి పాటకు ప్రోమో విడుదల చేశారు ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ బాగా దొబ్బేస్తున్నారు అంటూ బుల్లి రాజు చెప్పడంతో వెంటనే భీమ్స్ నన్ను కూడా దొబ్బేస్తున్నారు వెళ్లి అనిల్ గారిని అడగొచ్చు కదా అంటూ చెబుతారు.
ఈ మాట చెప్పడంతో వెంటనే బుల్లి రాజు అనిల్ వద్దకు వెళ్లి మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో అడగడం కోసం తనని సరదాగా కాకపడతారు. అనిల్ రావిపూడి మీద కాలు వేయడ తిరిగి కాళ్ళను నమస్కరిస్తూ అప్డేట్ ఇవ్వాలని కోరడంతో చివరికి ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల కాబోతుందని వెల్లడించారు. దీంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో ఎంతో విభిన్న రీతిలో వీడియోలను విడుదల చేస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
#MeesaalaPilla Lyrical Video on Monday, 13th October #MSG #ManaShankaraVaraPrasadGaru #Chiranjeevi #ChiruANIL @KChiruTweets @AnilRavipudi @sahugarapati7@sushkonidela @Shine_Screens@GoldboxEnt pic.twitter.com/gw59cdwcua
— BIG TV Cinema (@BigtvCinema) October 10, 2025
ఇక తాజాగా మీసాల పిల్ల సాంగ్ విషయంలో కూడా చాలా విభిన్నంగా ప్రమోట్ చేస్తూ ఈ వీడియోని విడుదల చేశారు. ఇక మీసాల పిల్ల పాట విషయానికి వస్తే ఈ పాటను ప్రముఖ సింగర్ ఉదిత్ ఆలపించారు. చిరంజీవి ఉదిత్ కాంబినేషన్లో ఇదివరకు వాన వాన వెన్నెల వాన, రామ్మా చిలకమ్మా వంటి సూపర్ హిట్ పాటలు వచ్చాయి. ఇలా చాలా సంవత్సరాల తర్వాత మరోసారి చిరంజీవి ఉదిత్ కాంబోలో మీసాల పిల్ల పాట విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు గోల్డెన్ బాక్స్, సైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Ramgopal Varma: శివ రీ రిలీజ్..36 ఏళ్లకు అర్థమైందంటున్న ఆర్జీవీ!