Ramgopal Varma : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాంగోపాల్ వర్మ(Ramgopal Varma) సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో సంచలనగా మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈయన చేసే పోస్ట్ పలు వివాదాలకు కూడా కారణం అవుతుంటుంది. ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ చేసిన సినిమాల కంటే కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. వర్మ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna),అమల (Amala) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం శివ(Shiva).
ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికీ కూడా ఈ సినిమా అంటే చెవి కోసుకునే అభిమానులు ఉన్నారు. ఇలా ఈ సినిమా విడుదలై దశాబ్దాలు పూర్తి అవుతున్న ఆల్ టైం క్లాసికల్ కల్ట్ సినిమాగా నిలిచిపోయిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా త్వరలోనే తిరిగి మరోసారి 4k వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. నవంబర్ 14వ తేదీ ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఇతర సినీ దర్శకులు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా వర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తాను 26 సంవత్సరాల వయసులో ఊహతో శివ పాత్ర సృష్టించానని తెలిపారు.అయితే అప్పుడు శివ పాత్ర గురించి ఏమీ అర్థం కాలేదని ఇప్పుడు 62 సంవత్సరాల వయసులో శివ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. ఈ సినిమా రీ రిలీజ్ కోసం చూస్తున్నప్పుడు ఈ కొత్త అవగాహన కలిగిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా విడుదలయి 36 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ కూడా 36 సంవత్సరాల తర్వాతనే నాకు శివ క్యారెక్టర్ పరిపూర్ణంగా అర్ధమైంది అంటూ తెలియచేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
సినిమాలపై ఫోకస్ తగ్గించిన వర్మ..
రాంగోపాల్ వర్మ ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలకు డైరెక్టర్ గా పని చేస్తూ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇక ఈయన వద్ద ఎంతోమంది శిష్యరికం పొంది ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో వారు కూడా అగ్ర దర్శకులుగా కొనసాగుతున్నారు. ఇకపోతే ఇటీవల రాంగోపాల్ వర్మ సినిమాల పట్ల పూర్తిగా ఫోకస్ తగ్గించారు. ఇటీవల కాలంలో ఈయన రాజకీయ నాయకుల జీవిత కథ ఆధారంగా పలు సినిమాలను చేస్తూ వివాదాలలో చిక్కుకుంటున్నారు. అయితే అభిమానులు మాత్రం ఈయన డైరెక్షన్లో ఇదివరకు వచ్చిన సినిమాలు రావాలని కోరుకుంటున్నారు .మరి ప్రేక్షకుల కోరిక మేరకు వర్మ గతంలో మాదిరిగా సినిమాలు చేస్తారా లేదంటే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Shivaji: వామ్మో శివాజీ ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారా… అన్ని సూపర్ హిట్టే!