OTT Movie : మలయాళం సినిమాలకు తెలుగు ఆడియన్స్ అభిమానులుగా మారుతున్నారు. ఈ ఇండస్ట్రీ నుంచి రియాలిటీకి దగ్గరగా ఉండే స్టోరీలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లోనే మంచి కంటెంట్ ఉన్న స్టోరీలను తెరకెక్కిస్తున్నారు అక్కడి దర్శకులు. ఈ నేపథ్యంలో రీసెంట్ గావచ్చిన ఒక లో బడ్జెట్ సినిమా ఆడియన్స్ ని ఆలోచింపజేస్తోంది. ఈ కథ పెళ్ళికి ముందే, విడాకుల ప్రస్తావనను తెస్తుంది. ఆసక్తికరంగా నడిచే ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘పి.డబ్ల్యూడి – ప్రపోజల్, వెడ్డింగ్ డివోర్స్’ (P.W.D – Proposal Wedding Divorce) అనే ఈ మలయాళం సినిమాకి, జో జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో జో జోసెఫ్, క్లెయిర్ సారా మార్టిన్, అనుమోధ్ పాల్, డోన్నా రిచర్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా IMDb లో 7.2/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 అక్టోబర్ 9 నుంచి సైనా ప్లే లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఐలీన్ అనే అమ్మాయి తన ప్రియుడు డేవిడ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. వాళ్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవవడానికి ప్లాన్ వేస్తారు. కానీ ఇంతలోనే ఐలీన్‌కు ఈ పెళ్లి మీద అనుమానం మొదలవుతుంది. డేవిస్ ఆమెను కేరింగ్ చేయట్లేదని, పెళ్లి విషయాల్లో కూడా అతను అంతగా చురుగ్గా లేడని ఐలీన్ బాధపెడుతుంది.దీంతో ఆమె పెళ్లికి ముందు రెండు కండిషన్ లు పెడుతుంది. మొదటిది మ్యారేజ్ సర్టిఫికేట్‌లో డివోర్స్ గురించి కూడా మెన్షన్ చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత, ఏదైనా సమస్య వస్తే సులభంగా డివోర్స్ తీసుకోవాలి. రెండవది పెళ్లికి ముందే డేవిస్ ఆమెను ఎమోషనల్‌గా సపోర్ట్ చేయాలి. ఈ డిమాండ్స్ విని డేవిస్ ఆశ్చర్య పోతాడు. మొదట ఈ కండిషన్లు చూసి డేవిడ్ కోపం తెచ్చుకుంటాడు. ఆ తరువాత ఆమెలో ఉన్న భయాన్నిచూసి తనని అర్థం చేసుకుంటాడు.
Read Also : సైకో పిల్లతో చావు దెబ్బలు తినే జీనీ… కడుపుబ్బా నవ్వించే కొరియన్ కామెడీ… ఈ వీకెండ్ కు సిరీస్ సెట్టు
ఈ కండిషన్ లకి అతను ఒప్పుకుని పెళ్లి వాయిదా వేసుకుంటాడు. ఇప్పట్నుంచి ఆమెలో ఉన్న భయాన్ని పోగొట్టాడానికి, తనలో ఉన్న ప్రేమను చూపించడానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తాడు. డేవిడ్ కుటుంబ సభ్యులు మొదట్లో ఈ పెళ్లి వద్దని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటారు. చివరికి డేవిడ్ ప్రయత్నం ఫలిస్తుందా ? వీళ్ళ పెళ్లి జరుగుతుందా ? ఐలీన్ ను డేవిడ్ ఇంప్రెస్ చేస్తాడా ? అనే విషయాలను, ఈ ఫీల్ గుడ్ మలయాళం సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.