Vibe Undi Baby Song Added: సూపర్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. సోషల్ పాంటషి మూవీగా వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. సూపర్ హీరో తేజ సజ్జ మరోసారి తనదైన నటనత సత్తాచాటాడు. విడుదలకు ముందు మిరాయ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని అంతకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. తక్కువ బడ్జెట్లోనే హై రేంజ్ క్వాలిటీ విజువల్స్ చూపించాడు.
ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో పూర్ సీజీ వర్క్, పూర్ విజువల్స్‌తో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్లోనే హై రేంజ్ క్వాలిటీతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు. దీంతో కార్తిక ఘట్టమనేని పనితీరుపై ఆడియన్స్, సినీ వర్గాలు ప్రశంసలు కరిపిస్తున్నాయి. అయితే మూవీకి మంచి హిట్ వచ్చినప్పటికి ఆడియన్స్ అందరిని మిరాయ్ టీం నిరాశ పరిచింది. సినిమా నుంచి హిట్ సాంగ్ని తొలగించి డిసప్పాయింట్ చేశారు. వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే పాట ఎంతటి విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్లో భాగంగా విడుదలైన ఈ పాట యూట్యూబ్ని షేక్ చేసింది.
మిలియన్ల వ్యూస్ ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమాపై హైప్ ఇవ్వడానికి ఈ పాట కూడా ఒక కారణం. అంతగా హిట్ అయిన ఈ పాటను సినిమాలో నుంచి తొలగించారు. ఇంత విజయం సాధించిన మూవీలో ఆ పాట కూడా ఉండి ఉంటే మరింత వైబ్ ఉండేదని ఆడియన్స్ అభిప్రాయం. ఈ పాట కోసమే థియేటర్ వెళ్లిన ఆడియన్స్ పెద్ద షాక్ అనే చెప్పాలి. దీంతో మూవీ ఆకట్టుకున్నప్పటికి.. వైబ్ ఉంది బేబే పాట లేకపోవడంతో ఆడియన్స్ కాస్తా నిరాశలోనే థియేటర్ నుంచి బయటకు వచ్చారు. దీంతో వారందరికి మిరాయ్ టీం తాజాగా శుభవార్త చెప్పింది. మళ్లీ ఈ పాటను సినిమాల్లో యాడ్ చేస్తున్నారట. మూవీలో ఈ రోజు నుంచి వైబ్ ఉంది పాట కూడా ఉండబోతుందట.
Also Read: Movie Tickets: 200 రూపాయలకే మూవీ టికెట్… ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హై కోర్టు
ఇది తెలిసి మూవీ లవర్స్ అంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. ముఖ్యంగా వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉంది పాట లవర్స్ని అయితే ఈ వార్త మరింత ఖుష్ చేస్తుంది. దీంతో ఈ పాట కోసం మళ్లీ ఆడియన్స్ మిరాయ్ థియేటర్లకు క్యూ కడుతున్నారట. కాగా సినిమా నిడివి తగ్గించేందుకు ఈ సాంగ్ని సినిమా నుంచి తీసేసినట్టు మూవీ టీం వెల్లడించింది. అప్పటికే సినిమా లెన్త్ మించి ఉండటంతో పాటను కట్ చేయకతప్పలేదట. ఇక సినిమా మంచి విజయం సాధించడం, మూవీలో పాట లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్న ఆడియన్స్ కోసం సాంగ్ మళ్లీ మూవీలో జోడించాలని మూవీ టీం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు(సెప్టెంబర్ 23) నుంచి పాటను సినిమాల్లో జోడించింది మిరాయ్ టీం.