YouTube No Earnings Policy| ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్. గూగుల్ కు చెందిన ఈ పాపులర్ ప్లాట్ ఫామ్ తాజాగా తన కొత్త పాలసీని ప్రకటించింది. ఒరిజినల్ గా లేని పునరావృతమయ్యే కంటెంట్‌ను నియంత్రించేందుకు కొత్త విధానాలను రూపొందించింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP)లో భాగంగా ఈ అప్డేట్ జులై 15, 2025 నుండి అమలులోకి వస్తుంది.
పునరావృత కంటెంట్‌కు ఆదాయం లేదు
కొత్త విధానం ప్రకారం.. యూజర్లకు ఎటువంటి విలువ లేని, లేదా.. చాలా తక్కువ విలువ ఇచ్చే మాస్-ప్రొడ్యూస్డ్ లేదా రీయూజ్డ్ కంటెంట్‌ను తొలగించడంపై దృష్టి పెడుతుంది. యూట్యూబ్ అధికారిక సపోర్ట్ పేజీలో ప్రచురితమైన సవరించిన మార్గదర్శకాలు, ఒరిజినల్, నిజమైన కంటెంట్ మాత్రమే ప్రమోట్ చేయబడుతుందని, ఆదాయం పొందగలదని స్పష్టం చేశాయి.
యూట్యూబ్ ఈ విధానాన్ని ఎందుకు మార్చింది?
నిజమైన కంటెంట్ సృష్టికర్తలను రక్షించడం మరియు ప్లాట్‌ఫామ్ దుర్వినియోగాన్ని తగ్గించడం యూట్యూబ్ లక్ష్యం. కొందరు సృష్టికర్తలు ఈ క్రింది విధంగా ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారు:
– క్లిక్‌బైట్ వీడియోలు
– తక్కువ నాణ్యత కలిగిన కంటెంట్
– రిపీటెడ్ వీడియోలు
కేవలం వ్యూస్ కోసం మాత్రమే తయారు చేసిన వీడియోలకు బదులుగా, విద్యాపరమైన లేదా వినోదాత్మక విలువను అందించే కంటెంట్‌ను యూట్యూబ్ ప్రోత్సహించాలనుకుంటోంది. రియాక్షన్ మాషప్‌లు, AI-జనరేటెడ్ స్లైడ్‌షోలు లేదా ఇతరుల కంటెంట్‌ను అతిగా ఎడిట్ చేసిన వీడియోలను పదేపదే పోస్ట్ చేసే సృష్టికర్తలకు ఇకపై మానిటైజేషన్ అవకాశం ఉండదు.
జులై 15 నుండి ఏ కంటెంట్ మానిటైజ్ అవుతుంది?
ఒరిజినల్ కంటెంట్‌ను నిరంతరం ఉత్పత్తి చేసే సృష్టికర్తలకు మాత్రమే యూట్యూబ్ ఆదాయాన్ని అందిస్తుంది. ఈ కంటెంట్‌లో ఈ క్రింది వాటిని చేర్చవచ్చు:
– యూజర్లకు జ్ఞానాన్ని అందించే విద్యాపరమైన వీడియోలు
– సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండే వినోదాత్మక వీడియోలు
– ఒరిజినల్ వాయిస్ మరియు విజువల్స్‌తో కూడిన నిజమైన కంటెంట్
మానిటైజేషన్ అర్హత ప్రమాణాలు
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో చేరడానికి, సృష్టికర్తలు కనీస అర్హత ప్రమాణాలను పాటించాలి.
– 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లు
– గత 12 నెలల్లో 4,000 పబ్లిక్ వాచ్ గంటలు
– గత 90 రోజుల్లో 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వీక్షణలు
ఈ షరతులను పూర్తి చేసిన తర్వాత, యూట్యూబ్ కంటెంట్ ఒరిజినాలిటీని సమీక్షించి మానిటైజేషన్‌కు ఆమోదం ఇస్తుంది.
కాపీ-పేస్ట్ ఛానెల్‌లకు మానిటైజేషన్ నిలిపివేత
కొత్త నియమాల ప్రకారం, కింది విధానాలను ఉపయోగించే సృష్టికర్తలు ఆదాయం పొందలేరు:
– ఇతరుల కంటెంట్‌ను కాపీ చేయడం
– కంటెంట్‌ను రీపర్పస్ చేయడం
– ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను ఎడిట్ చేసి తిరిగి అప్ లోడ్ చేయడం
జులై 15 నుండి, యూట్యూబ్ క్రియేటివేటీ, అధిక క్వాలిటీ కలిగిన కంటెంట్ ఇకోసిస్టమ్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతుంది.
Also Read: ఇక ఈ ఫోన్లలో గూగుల్ క్రోమ్ పనిచేయదు.. ఆగస్టు 2025 డెడ్ లైన్
యూట్యూబ్‌లో అప్డేట్ చేయబడిన పాలసీ నిజమైన క్రియేటర్లను ప్రోత్సహించడం, ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేసే ఛానెల్‌లను ఫిల్టర్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం వ్యూస్ కోసం మాత్రమే కాకుండా.. విద్యాపరమైన లేదా వినోదాత్మక విలువను అందించే కంటెంట్‌ను సృష్టించే వారికి ఈ విధానం లబ్ధి చేకూరుస్తుంది. ఒరిజినల్ కంటెంట్‌తో యూట్యూబ్ కమ్యూనిటీకి వాల్యూ అడిషన్ నే యూట్యూబ్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.