Pawan Kalyan -Ram Charan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం బుచ్చిబాబు సనా(Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు అభిమానులను ఖుషీ చేయడానికి.. తాను సంతకం చేసిన సినిమాలను వరుసగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్.. జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జూలై 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
హరిహర వీరమల్లు – 2 పై భారీ అప్డేట్..
ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. ఇక విడుదలకు హరిహర వీరమల్లు మొదటి భాగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రెండవ భాగానికి సంబంధించిన మరొక అప్డేట్ అభిమానులలో పూర్తి ఎక్సైట్మెంట్ను కలిగిస్తోంది అని చెప్పవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హరిహర వీరమల్లు -2 సినిమాలో రామ్ చరణ్ కీ రోల్ పోషించనున్నట్లు సమాచారం.
కథను మలుపు తిప్పనున్న రామ్ చరణ్..
అంతేకాదు రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమని, కథను కీలక మలుపు తిప్పుతుందని, సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంటుందని ఒక గాసిప్ ఇప్పుడు చెక్కర్లు కొడుతోంది. ఇకపోతే అసలే మామూలుగా బాబాయ్ – అబ్బాయ్.. పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఒకే చోట కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఇద్దరు కలిసి ఒకే సినిమాలో.. అందులోనూ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని తెలియడంతో ఇక పార్ట్ 2 ఎప్పుడు మొదలుపెడతారు? ఎప్పుడు విడుదల చేస్తారని? అభిమానులు చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా.. ఆ తర్వాత జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏ.ఏం.రత్నం భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటిస్తోంది. వీరితోపాటు సత్యరాజ్ ,నర్గీస్ ఫక్రీ, సునీల్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ట్రైలర్ లో ఆ పాత్ర పై అభ్యంతరాలు..
ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ లో సత్యరాజ్ కనిపించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మురుగన్ మానాడు సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు దీటుగా సత్యరాజ్ కౌంటర్ వేయడంతో.. మరి అలాంటి వాడికి సినిమాలో అవకాశం ఇచ్చారు.. అతడు విశ్వాసం చూపించుకోలేకపోయాడు.. వెంటనే అతడి సన్నివేశాలు డిలీట్ చేసే సినిమా రిలీజ్ చేయండి అని నెటిజన్స్ కూడా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
ALSO READ:Rakul Preet Singh: దీనస్థితికి చేరుకున్న రకుల్ భర్త.. ఎట్టకేలకు స్పందించిన జాకీ భగ్నానీ!