E-Paper
Advertisement

కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!

కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!
Advertisement

Tollywood:ఇటీవల కాలంలో సెలబ్రిటీలు చెప్పా పెట్టకుండా తమకు నచ్చిన వారితో నిశ్చితార్థం చేసుకోవడం.. లేదా ఏకంగా పెళ్లి పీటలు ఎక్కేయడం, ఆ తర్వాత ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. ఎలాంటి హడావిడి లేకుండా.. చడీచప్పుడు కాకుండా తాను ప్రేమించిన వ్యక్తితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది.ఇక ఆ విషయాన్ని తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేస్తూ తన కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది.

రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న మృణాళిని రవి..

ఆమె ఎవరో కాదు మృణాళిని రవి (Mirnalini Ravi). 2019లో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా నటించిన ‘సూపర్ డీలక్స్’ చిత్రంతో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో హీరోయిన్గా చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర వంటి సినిమాలు చేసింది. తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. చివరిగా 2024 లో రోమియో అనే తమిళ చిత్రంలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది. అలా రెండేళ్లుగా నటనకు దూరంగా ఉన్న మృణాళిని రవి సడన్గా తనకు నిశ్చితార్థమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

Advertisement

ALSO READ:కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?

వరుడు ఎవరంటే?

అతడు ఎవరు అనే విషయానికి వస్తే.. మలేషియాకు చెందిన మహావిష్ణు (Maha Vishnu) అనే ఆధ్యాత్మిక గురువుతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈమె సిద్ధమైంది . ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్తతో చనువుగా ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గత ఏడు సంవత్సరాలుగా స్నేహితులైన వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు. మొత్తానికి అయితే తన నటనకు గుడ్ బై చెప్పేసి.. ఇక వైవాహిక బంధం లోనే సెటిల్ కావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే పెళ్లి ఎప్పుడు అనే విషయాలపై ఇంకా స్పష్టతనివ్వలేదు.

మృణాళిని రవి కెరియర్..

Advertisement

మృణాళిని రవి కెరియర్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ వీడియోలు చూసిన డైరెక్టర్ త్యాగరాజన్ కుమార్ రాజా సూపర్ డీలక్స్ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఈ సినిమాలో ఏలియన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. గద్దల కొండ గణేష్ చిత్రం తర్వాత మళ్లీ తమిళ చిత్రాల వైపే వెళ్ళిన ఈమె.. అక్కడ ఛాంపియన్, ఎంజిఆర్ మగన్, ఎనిమీ, జాంగో, కోబ్రా వంటి తమిళ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 2024లో రోమియో తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!

కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?

డ్యాన్సర్ అసోసియేషన్లో మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫెడరేషన్ మండిపాటు!

పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిన పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?

‘అబద్ధమేవ జయతే’ పాటను విడుదల చేసిన దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ..

బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి చూడాల్సిన టాప్ తెలుగు సినిమాలు

స్నేహాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు.. ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన 10 సాంగ్స్

Big Stories

Advertisement
×