E-Paper
Advertisement

ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!

ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!
Advertisement

Oil Palm: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యం అధికారుల ఉదాసీనత, ప్రైవేట్ కంపెనీల నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన భారీ లక్ష్యాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోందనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

భారీ లక్ష్యం.. అంతంతమాత్రం ప్రగతి..

రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 85 వేల ఎకరాల భూమిలో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన టార్గెట్ విధించింది. అయితే, ఏడాదిలో ఇప్పటికే 7 నెలలు గడిచిపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో సాధించిన ప్రగతి మాత్రం కేవలం 20 శాతానికి మించకపోవడం గమనార్హం. ఇప్పటివరకు కేవలం 17,090 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయినట్లు అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో ఐదో వంతు కూడా పూర్తికాకపోవడానికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపమేనని స్పష్టమవుతోంది.

సమీక్షలతోనే కాలం వెళ్లదీస్తున్న మంత్రి?

Advertisement

సాగు విస్తరణలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేవలం ఎడతెగని సమీక్షా సమావేశాలతోనే సరిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం అధికారులతో సమావేశాలు నిర్వహించి, హెచ్చరికలు జారీ చేయడం మినహా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన కొరవడటంతో కిందిస్థాయి అధికారుల్లో జవాబుదారీతనం కరువైందనే విమర్శలు బలపడుతున్నాయి.

Also Read: ముగ్గురినే ఉతికి ఆరేశాం.. మిగిలిన 21 మంది వైసీపీ నాయకులను వదిలేదే లేదు!- జేసీ ప్రభాకర్ రెడ్డి

తీరుమారని కంపెనీలు..

Advertisement

ఆయిల్ పామ్ సాగు విస్తరణలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, లక్ష్యాలను సాధించాల్సిందేనని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు పనితీరు సరిగా లేని కంపెనీలకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. జగిత్యాల జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోహియా కంపెనీకి, గద్వాల, నారాయణపేట, జనగామ జిల్లాలలో పనిచేస్తున్న ఆయిల్ ఫెడ్‌కు నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు.

రెండు సార్లు నోటీసులు జారీ..

పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న తిరుమల కంపెనీకి, భూపాలపల్లి, ములుగు, వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రియూనిక్ కంపెనీకి, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో పనిచేస్తున్న రామ్ చరణ్ కంపెనీకి మూడు సార్లు నోటీసులు,సంగారెడ్డి జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రెజ్ కంపెనీకి రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. విశ్వతేజ్ కంపెనీకి ఐదు సార్లు, కేన్ బయో కంపెనీకి ఆరు సార్లు, పతంజలి కంపెనీకి ఆరు సార్లు, మాట్రిక్స్ కంపెనీకి ఐదు సార్లు, సువేన్ ఆగ్రో కంపెనీకి మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కంపెనీలలో ఆశించిన మార్పు కనిపించలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫెడ్ కంపెనీల తీరులో ఎటువంటి మార్పు రాలేదు. మంత్రి హెచ్చరికలను ఆ కంపెనీలు పెడచెవిన పెడుతున్నా, కిందిస్థాయి యంత్రాంగం వాటిపై చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి.

Also Read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా అధికారుల తీరు?

నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతున్న ఆయిల్ ఫాం కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. సదరు కంపెనీలకు నామమాత్రపు షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారికి వంతపాడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో అధికారుల ఈ వైఖరి ఇలాగే కొనసాగితే, ఆయిల్ పామ్ సాగు ఆశయం నీరుగారిపోతుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపట్టి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాల చూపడంలోనూ అలసత్వం

రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ఆకర్షించడంలో, వారికి రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి మార్గదర్శనం చేయడంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై దృష్టి పెట్టాల్సిన అధికారులు, కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతూ సమీక్షలు నిర్వహించడంతోనే సరిపెడుతున్నారనేఆరోపణలు వస్తున్నాయి.

Also Read: కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!

Related News

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

డిజిటల్ సేవల్లో తెలంగాణ నయా రికార్డు.. దేశంలోనే నెంబర్ వన్ స్థానం!

లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

బోనాల జాతరలో భక్తుల అవస్థలు.. వీఐపీలకు స్పెషల్ దర్శనం, ప్రజాసేవలో ‘బిగ్ టీవీ’

కాళ్లు-చేతులు కట్టేసి.. భార్య గొంతు కోసిన భర్త, హనుమకొండలో దారుణం

Big Stories

Advertisement
×