Murali Naik Biopic: వీర జవాన్ మురళి నాయక్ (Murali Naik)గురించి పరిచయం అవసరం లేదు. సత్యసాయి జిల్లా కల్లి తాండకు చెందిన మురళి నాయక్ చిన్నప్పటి ఎంతో దేశభక్తి కలిగి ఇండియన్ ఆర్మీలోకి వెళ్లారు. అయితే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) లో భాగంగా శత్రువుల చేతిలో ఆశవులు బాసిన సంగతి తెలిసిందే. ఇలా శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందిన మురళి నాయక్ మరణంతో దేశం మొత్తం ఎంతో దిగ్భ్రాంతి చెందింది. మురళి నాయక తల్లిదండ్రులకు తను ఏకైక సంతానం కావడం గమనార్హం. ఇలా ఉన్న ఒక్క కొడుకును దేశ సేవ కోసం పంపించగా భరతమాత ఒడిలోనే మురళి నాయక్ తుదిశ్వాస విడిచారు.
మురళి నాయక్ పాత్రలో గౌతమ్ కృష్ణ..
ఇలా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మురళి నాయక్ జీవిత కథ ఇంతటితో ఆగిపోకూడదని ఈయన జీవిత కథ ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఈయన బయోపిక్ సినిమా చేయటానికి సిద్ధమయ్యారు. కే సురేష్ బాబు ప్రొడక్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ(Gautham Krishna) మురళి నాయక్ బయోపిక్ సినిమాలో చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన విషయాల గురించి గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లకు సంబంధించి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే వారంతా మేజర్, కల్నల్ స్థానంలో ఉన్న వారి బయోపిక్ సినిమాలు కావటం విశేషం. ఒక సాధారణ జవాన్ బయోపిక్ సినిమా ఇప్పటివరకు రాలేదని తెలిపారు.
వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్..
ఇక తెలుగు జవాన్ కి సంబంధించి ఒక్క బయోపిక్ సినిమా కూడా లేకపోవడంతో మురళి నాయక్ బయోపిక్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇదే విషయం గురించి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడితే వాళ్లు చాలా సంతోషించారని తెలిపారు. మురళి నాయక కుటుంబ సభ్యులు స్నేహితులను అడిగి అతని గురించి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్నానని, ఇక వాళ్ళ అమ్మగారు అయితే నువ్వు చేస్తానంటే మాత్రమే నా కొడుకు బయోపిక్ సినిమాకు ఒప్పుకుంటాను, మరి ఎవరైనా నటిస్తారంటే అందుకు ఒప్పుకోనని కూడా తెలిపారు.
మురళి నాయక్ కుటుంబానికి అండగా గౌతమ్ కృష్ణ..
గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలో బాయ్ (Solo Boy) సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మురళి నాయక్ తల్లిదండ్రులు హాజరయ్యారు అయితే ఆ సమయంలో వాళ్లు నాతో బాగా కనెక్ట్ అయ్యారని అమ్మ నాతో మాట్లాడుతూ మా మురళి కూడా ఎప్పుడు నీలాగే బిహేవ్ చేసేవారు నిన్ను చూస్తుంటే తనని చూసిన అనుభూతి కలుగుతుందని ఎమోషనల్ అయ్యారని గౌతమ్ కృష్ణ తెలిపారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి అందరికీ తెలియచేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమాని కేవలం తెలుగుకు మాత్రమే కాకుండా అన్ని భాషలలో విడుదల చేయబోతున్నామని, త్వరలోనే షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని గౌతమ్ కృష్ణ వెల్లడించారు. ఇక గౌతమ్ కృష్ణ గతంలో సోలో బాయ్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా తన వంతు సాయంగా మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: HHVM OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న వీరమల్లు.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్!