BigTV English

OTT Movie : ఇదసలు సూపర్ హీరో సిరీసేనా ? అన్నీ మసాలా సీన్లే…ఫ్యామిలీతో అస్సలు చూడకూడని సిరీస్

OTT Movie : ఇదసలు సూపర్ హీరో సిరీసేనా ? అన్నీ మసాలా సీన్లే…ఫ్యామిలీతో అస్సలు చూడకూడని సిరీస్

OTT Movie : చిన్న పిల్లలనుంచి పెద్దలదాకా చూసే సినిమాలు, సిరీస్ లు ఏమైనా ఉన్నాయంటే, అవి సూపర్‌హీరో స్టోరీలే. వీటిలో ప్రధానంగా మార్వెల్, DC కామిక్స్ ముందు వరసలో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూపర్‌హీరో సిరీస్ DC కామిక్స్ రూపొందించింది. ఈ సిరీస్ ఓటీటీలో కేక పెట్టిస్తోంది. అయితే ఇందులో కాస్త మసాలా కంటెంట్ కూడా ఉంటుంది. అలాంటి సీన్స్ సెన్సార్ ఉంటే, పిల్లలతో ఎంచెక్కా కలసి చూడొచ్చు. ఈ సిరీస్ సమాజానికి దూరంగా ఉండే సూపర్‌హీరోల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘డూమ్ పెట్రోల్’ (Doom Patrol) DC కామిక్స్ ఆధారంగా రోపొందిన ఒక అమెరికన్ సూపర్‌హీరో టెలివిజన్ సిరీస్. ఇది నాలుగు సీజన్‌లు (2019 నుండి 2023 వరకు) నడిచింది. మొత్తం 46 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను జెరెమీ కార్వర్ సృష్టించారు. ఇందులో డయాన్ గెరెరో, ఏప్రిల్ బౌల్‌బీ, మాట్ బోమర్, జోవాన్ వేడ్, టిమోతీ డాల్టన్, బ్రెండన్ ఫ్రేజర్ నటించారు. ఇది Amazon Prime Video, HBO Maxలో ఇంగ్లీష్ ఆడియో, ఇంగ్లీష్, స్పానిష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది.


స్టోరీలోకి వెళ్తే

డూమ్ పెట్రోల్ అనేది ఒక విచిత్రమైన సూపర్‌హీరోల గురించి తెరకెక్కింది. వీరిని డాక్టర్ నైల్స్ కౌల్డర్ (చీఫ్) అనే శాస్త్రవేత్త ఒకచోట చేర్చి, వారి శక్తులను ఉపయోగించి ప్రపంచాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఈ బృందంలో రోబోట్‌మ్యాన్, నెగెటివ్ మ్యాన్, ఎలాస్టి-గర్ల్, క్రేజీ జేన్, సైబోర్గ్ ఉంటారు. ఈ కథలో కామెడీ , సైన్స్ ఫిక్షన్, సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్ కలగలసి ఉంటాయి.

రోబోట్‌మ్యాన్ : క్లిఫ్ ఒక ప్రముఖ రేస్ కార్ డ్రైవర్. కానీ ఒక భయంకరమైన ప్రమాదంలో అతని శరీరం కాలిపోతుంది. చీఫ్ అతని మెదడును ఒక రోబోటిక్ శరీరంలోకి మారుస్తాడు. దీనివల్ల అతను సూపర్‌హ్యూమన్ బలం, డ్యూరబిలిటీ పొందుతాడు. కానీ అతను తన మానవ శరీరం, కుటుంబంతో సంబంధాన్ని కోల్పోతాడు.

నెగెటివ్ మ్యాన్ : లారీ ఒక గే పైలట్. ఒక విమాన ప్రమాదంలో రేడియోఆక్టివ్ ఎనర్జీ ఎంటిటీతో లింక్ అవుతాడు. ఈ ఎంటిటీ అతనికి అసాధారణ శక్తులను ఇస్తుంది. కానీ అతను తన శరీరాన్ని వదిలి ఎక్కువ సమయం ఉండలేడు. లారీ తాను గే అనే విషయం కుటుంబంతో చెప్పకుండా దాచడం వల్ల బాధపడుతుంటాడు.

ఎలాస్టి-గర్ల్ : రీటా ఒక గ్లామరస్ హాలీవుడ్ నటి. కానీ ఒక సినిమా షూటింగ్ సమయంలో, ఒక విషపూరిత పదార్థంతో, ఆమె శరీరం ఆకారాన్ని మార్చగల సామర్థ్యం పొందుతుంది. ఆమె గతంలో తన ప్రవర్తన కారణంగా, కెరీర్ ను కోల్పోవడం వల్ల మానసికంగా డీలా పడుతుంది.

క్రేజీ జేన్ : జేన్‌కు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ ఉంది, మరియు ఆమెలో 64 వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన సూపర్‌పవర్ కలిగి ఉంటుంది. ఆమె బాల్యంలో ఎదుర్కొన్న గాయం (లైంగిక వేధింపు) ఆమె వ్యక్తిత్వాలను విడిపోయేలా చేసింది. జేన్ యొక్క కథ ఆమె ఆంతరిక సంఘర్షణలు మరియు ఆమె వ్యక్తిత్వాల మధ్య సమతుల్యతను కనుగొనే ప్రయత్నంపై దృష్టి పెడుతుంది.

సైబోర్గ్ : విక్ ఒక అథ్లెట్. అతను ఒక ప్రయోగశాల ప్రమాదంలో తన శరీరంలో ఎక్కువ భాగం కోల్పోతాడు. అతని తండ్రి సిలాస్ స్టోన్ అతన్ని సైబర్‌నెటిక్ టెక్నాలజీతో పునర్నిర్మిస్తాడు. దీనివల్ల అతను సూపర్‌హ్యూమన్ శక్తులను పొందుతాడు.

చీఫ్ : చీఫ్ ఒక శాస్త్రవేత్త, డూమ్ పెట్రోల్ నాయకుడు. అతను ఈ బృందాన్ని ఒకచోట చేర్చి, వారిని రక్షించడానికి, వారి శక్తులను ఉపయోగించడానికి సహాయం చేస్తాడు.

సీజన్ 1 (2019) ఈ బృందం మిస్టర్ నోబడీ అనే పెద్ద శత్రువుతో పోరాడుతారు. మిస్టర్ నోబడీ ఒక సూపర్‌నాచురల్ విలన్, అతను రియాలిటీని మార్చగల సామర్థ్యం కలిగి ఉంటాడు. ఈ సీజన్‌లో చీఫ్ అదృశ్యమవుతాడు. ఈ బృందం అతన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఒకచోట చేరుతుంది. వీళ్లంతా ఈ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు.

సీజన్ 2 (2020) చీఫ్ కుమార్తె డోరతీ శక్తివంతమైన, రియాలిటీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సీజన్‌లో కాండిల్‌మేకర్ అనే శత్రువు పరిచయం అవుతాడు. అతను డోరతీ స్నేహితుడు, ఒక ప్రమాదకరమైనవాడు. ఈ సమయంలో, బృందం సభ్యులు చీఫ్ స్వార్థపరమైన చర్యలను ఎదుర్కొంటారు.

సీజన్ 3 (2021): ఇక్కడ మడామ్ రూజ్ అనే కొత్త పాత్ర పరిచయం అవుతుంది. ఆమె బ్రదర్‌హుడ్ ఆఫ్ ఈవిల్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సీజన్‌లో వీళ్లంతా ఈవిల్‌ ని ఎదుర్కుంటూ, తమ గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. వీళ్ళు డెడ్ బాయ్ డిటెక్టివ్స్ వంటి విచిత్రమైన పాత్రలను కలుస్తారు. సిస్టర్‌హుడ్ ఆఫ్ దాదా వంటి సంస్థలతో కలసి పనిచేస్తారు.

సీజన్ 4 (2022–2023) చివరి సీజన్‌లో ఈ బృందం తమ మరణాన్ని, భవిష్యత్తును ఎదుర్కొంటుంది. వీళ్లంతా ఇమ్మోర్టస్ అనే శత్రువుతో పోరాడతారు. అతను వాళ్ళ జీవితాలను, రియాలిటీని ప్రమాదంలో పడేస్తాడు. ఈ సీజన్‌లో బృందం సభ్యులు తమ గత గాయాలను పూర్తిగా అధిగమించి, తమ జీవితంలో శాంతిని కనుగొనే ప్రయత్నం చేస్తారు. కథ ఒక ఎమోషనల్ గా, వీళ్ళ త్యాగాలను హైలైట్ చేస్తూ ముగుస్తుంది.

Related News

OTT Movie : సొంత తండ్రి మర్డర్ కు మాస్టర్ ప్లాన్… ఇంటెన్స్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : హత్య కేసు ఒక్కటే… ట్విస్టులు మాత్రం బోలెడు… మతిపోగోట్టే మలయాళ మర్డర్ మిస్టరీ

HHVM OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న వీరమల్లు.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్!

OTT Movie : తన మాంసాన్ని తనే పీక్కుతినే పిల్లాడు… రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ సీన్స్… ఒంటరిగా చూడకూడని సినిమా

OTT Movie : మెంటల్ హాస్పిటల్లో పేషంట్స్ మిస్సింగ్… మెంటలెక్కించే ట్విస్టులు… కిర్రాక్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

×