HHVM OTT: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులకు వీరమల్లు సినిమా నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu). హిస్టారికల్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా రావటం, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ఆలస్యం అవుతూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు వీలైనప్పుడు సినిమాలను పూర్తి చేస్తూ వచ్చారు.
ఓటీటీ విడుదలకు సిద్ధమైన వీరమల్లు…
ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా జులై 24 వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేశారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా థియేటర్ రన్ పూర్తిచేసుకుని ఓటీటీ విడుదలకు (OTT release)సిద్ధమవుతుంది. నిజానికి ఈ సినిమాని ఆగస్టు 22వ తేదీ నుంచి ప్రసారం చేస్తారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)అధికారకంగా వెల్లడించారు.
ఆగస్టు 20 నుంచి ప్రసారం..
ఈ సినిమాని ఆగస్టు 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేస్తూ.. వీరమల్లు తిరుగుబాటు ,కోపం, నీతి కథ. థియేటర్లలో ప్రారంభమైన తుఫాను ఇప్పుడు మీ స్క్రీన్ల వద్దకు వచ్చేస్తోంది అంటూ ఈ సినిమా ఆగస్టు 20వ తేదీ అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు. తెలుగు తమిళ కన్నడ భాషలలో ఈ సినిమా మరి కొన్ని గంటలలో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A tale of rebellion, rage and righteousness ⚔️🔥
The storm that started in theatres now takes over your screens ✊🏽
Watch the saga of #HariHaraVeeraMallu Sword vs Spirit unfold from AUGUST 20 only on @PrimeVideoIN 🦅
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj… pic.twitter.com/BecLLUdA9V
— Hari Hara Veera Mallu (@HHVMFilm) August 19, 2025
ఈ సినిమాని థియేటర్లో చూడటం మిస్ అయిన అభిమానులు అమెజాన్ ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పోరాట యోధుడి పాత్రలు కనిపించారు. ఇక నిధి అగర్వాల్(Nidhi Agerwal) ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించగా బాబీ డియోల్, సత్యరాజ్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకుడిగా పనిచేశారు. కొంత భాగం షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో తిరిగి నిర్మాత ఏ . యం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందని చెప్పాలి. మరి థియేటర్లో మెప్పించ లేకపోయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Shivani Nagaram: అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శివాని.. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలు?