Video viral: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అయితే కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారుల్లో వరద నీరు ప్రవాహం చూస్తుంటే వాగు పొంగిపొర్లినట్టుగా కనిపిస్తోంది. ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయిపోతుంది. భారీ వర్షానికి నగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వరదల్లో ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ అవతారం ఎత్తాడు. వరద నీటిని తొలగిస్తున్నట్టు సోషల్ మీడియా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
?utm_source=ig_web_copy_link">https://www.instagram.com/shaddyman98/reel/DNfxIdRBFv_/
ముంబై నగరంలో బీవండి మార్కెట్లో ఓ వ్యక్తి స్పైడర్‌మ్యాన్ అవతారం ఎత్తాడు. అతను స్పైడర్ మ్యాన్ బట్టలు ధరించి నగర వీధుల్లో హీరోలా వరద నీటిని తొలగిస్తూ నెటిజన్లు మనసులు గెలుచుకున్నాడు. వేగంగా ప్రవహిస్తోన్న వరద నీటిని తొలగిస్తున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే.. అతను వరద నీటిని తొలగిస్తున్న సమయంలో స్థానిక కాలనీ వాసులు దృశ్యాలను కెమెరాలో బంధించారు. వీడియో చూడడానికి కామెడీగా ఉండడంతో సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి గతంలో కూడా స్పైడర్‌మ్యాన్ రూపంలో ఇలాంటి వీడియోలు చేసినట్టు తెలుస్తోంది.
https://www.instagram.com/shaddyman98/reel/DNiBSZzx8WK/
ALSO READ: Dance video: చీరలో డ్యాన్స్ దుమ్ముదులిపేసింది భయ్యా.. హీరోయిన్ కూడా పనికిరాదు.. వీడియో వేరే లెవల్
ఇదే వరద నీటిలో ఆ వ్యక్తి మరో వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఈసారి వరద నీటిలో థర్మోస్లాస్క్ సాయంతో స్విమ్మింగ్ చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. రద నీటిలో స్వయంగా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. ‘ముందు నేను నన్ను కాపాడుకుంటాను.. ఆ తర్వాత అందరినీ కాపాడతాను’ అని పోస్ట్ చేశాడు. అని ఇది కూడా సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘స్పైడర్‌మ్యాన్ వరద నీటిని తొలగిస్తూ కనిపించాడు.. వరద నీరు పూర్తయ్యే వరకు ఇంకా చాలా నీళ్లు తొలగించాలి’ అని హస్యాస్పదంగా కామెంట్ చేశాడు.
ALSO READ: Viral video: ఇవి వరద నీళ్లా.. స్విమ్మింగ్ పూలా..? ఎలా ఈత కొడుతున్నారో చూడండి, వీడియో వైరల్
ఈ రెండు వీడియోలు ముంబైలోని వరద పరిస్థితులను, అలాగే ఈ వ్యక్తి హాస్యాస్పదమైన, సామాజిక స్పృహతో కూడిన ప్రయత్నాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సంఘటన ముంబై వాసులకు కొంత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని అందించిందని చెప్పవచ్చు. స్పైడర్‌మ్యాన్ రూపంలో ఈ వ్యక్తి చేసిన పని కష్ట సమయంలో సమాజానికి సహాయం చేయాలనే సందేశాన్ని పంపించదని చెప్పవచ్చు. మొత్తానికి ముంబై నగరవాసులను ఈ వీడియోలు కొంత ఆనందానికి గురిచేశాయి.