Virgin Boys Trailer: ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలే మంచి విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే. వర్జిన్ బాయ్స్. గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనిత్, అన్షులా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, కౌశల్ మండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజా దరపునేని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వర్జిన్ బాయ్స్ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ముగ్గురు స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్న వారు కాలేజ్ లోకి అడుగుపెట్టాకా.. ఆ వయస్సులో ఉండే కోరికలకు ఆకర్షితులు అవుతారు. ముగ్గురు.. ముగ్గురు అమ్మాయిల ప్రేమలో పడతారు. ఎలాగైనా వారితో రొమాన్స్ చేసి వర్జినిటీ పోగొట్టుకోవాలని చూస్తారు. అంతలోనే వారికి అనుకోని ఆపద ఎదురవుతుంది. మరి చివరకు వారి కల నెరవేరిందా.. ? ఎట్రాక్షన్ అనుకున్న బంధాలు ప్రేమగా ఎలా మారాయి.. ? పెళ్ళికి ముందు శృంగారం తప్పు అనే హీరోయిన్ మాట నెగ్గిందా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ లో అడల్ట్ కామెడీతో పాటు ఎమోషన్స్ ను కూడా చూపించారు. ప్రేమ, పెళ్లి ఎంత గొప్పవి.. ఆకర్షణకు లోనై ముగ్గురు యువకులు చేసిన తప్పు ఏంటి.. ? అనేది ట్విస్ట్ గా చూపించార. ఇక ట్రైలర్ లో మిత్రా శర్మతో పాటు మిగిలిన హీరోయిన్స్ అందాలు హైలైట్ గా నిలుస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ట్రైలర్ లో చాలా బూతులే గుప్పించారు. చివర్లో నాని ప్యారడైజ్ లోని డైలాగ్ లం*జ కొడుకా అనేది కూడా వాడేశారు. ఇక వర్జినిటీ, కండోమ్స్.. సె*క్స్ ఇలాంటి పదాలను వాడేశారు.
ఈకాలం యువతకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. కథ మొత్తం అడల్ట్ కామెడీ కాకుండా ప్రేమ అనే ఎమోషన్ ను జోడించడంతో సినిమా హిట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈమధ్యకాలంలో మిత్రా శర్మ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ హైప్ తెచ్చుకుంది. లేడీ కమెడియన్ పాకీజా పరిస్థితికి చాలించి మిత్రా శర్మ ఆమెకు ఆర్థిక సహాయం అందించింది. అంతేకాకుండా ఎంతోమందికి ఆమె హెల్ప్ చేసిందని సమాచారం. దీంతో మిత్రా శర్మ ఇంపాక్ట్ ఈ సినిమాపై బలంగా చూపిస్తుందని చెప్పొచ్చు.
ఇక సినిమాకు హైలైట్ అంటే మ్యూజిక్. స్మరన్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా కనిపించాయి. కాలేజ్, మిగతా లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై ఒక హైప్ క్రియేట్ చేశారు. జూలై 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వర్జిన్ బాయ్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.