Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం సౌత్ ,నార్త్ అని తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు. ఇటీవల వరుసగా యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈమె మైసా(Mysaa) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక మామూలుగా వివాదాల జోలికి వెళ్లరు కానీ కొన్ని సందర్భాలలో ఈమె మాట తీరు కారణంగా వివాదాలలో నిలుస్తున్నారు.
కొడవ జాతి
గత కొద్ది రోజుల క్రితం రష్మిక తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో మారుమూల కూర్గ్ జిల్లాలో కొడవ జాతిలో(Kodava Community) జన్మించిన తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఇలా సక్సెస్ అవుతానని ఊహించలేదు. ఇలా కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ నేనే అంటూ ఎంతో గొప్పగా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. రష్మిక కంటే కూడా ఎంతోమంది ఈ జాతి నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, సెలెబ్రిటీలుగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలకు మద్దతుగా మరొక నటి హర్షిక పునాచ (Harshika Poonacha)స్పందించారు.
పొరపాటుగా మాట్లాడింది, వదిలేయండి…
హర్షిక కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈమె తెలుగులో కూడా ఏడుకొండలవాడా వెంకటరమణ అందరూ బాగుండాలి, అప్పుడలా ఇప్పుడిలా మంచి సినిమాలలో నటించారు. ప్రస్తుతం అయితే ఈమె కన్నడలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా రష్మిక వ్యాఖ్యలపై స్పందించిన హర్షిక.. కొడవ జాతి నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ నేనే అంటూ రష్మిక పొరపాటున నోరు జారింది. పాపం తనని వదిలేయండి. బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి కొడవ నటి తాను అన్నది పూర్తిగా అవాస్తమని, రష్మిక కంటే ముందుగా గుల్షన్ దేవయ్య అనే నటుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగారని ఈమె తెలియజేశారు.
ప్రోత్సహించండి.. క్రిందికి లాగొద్దు
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మికను చూసి మా కొడవ జాతి సంతోష పడుతోందని హర్షిక తెలిపారు. ఇండస్ట్రీలో తన సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా తెగలో అమ్మాయిలు ఏదైనా సాధించాలి అనుకుంటే వారి నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హర్షిక ఈ సందర్భంగా తెలిపారు. కెరియర్ పరంగా రష్మిక ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉందని వీలైతే ఆమెను ప్రోత్సహించండి కానీ ,ఇలా కిందికి లాగే ప్రయత్నం చేయొద్దు అంటూ హర్షిక రష్మికకు మద్దతు తెలియజేస్తూ వచ్చారు.. ఇక రష్మిక ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలకు షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Sekhar Kammula: సమంతతో శేఖర్ కమ్ముల.. ఆ జానర్ లో ప్లాన్ చేసిన డైరెక్టర్!