Pawan Kalyan OG Movie: ప్రస్తుతం స్టార్ హీరోలంత పాన్ ఇండియా వెంట పరుగులు పెడుతున్నారు. చిన్న హీరో నుంచి అగ్ర హీరోల వరకు.. మీడియా రేంజ్ దర్శకుల నుంచి పెద్ద డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు ఓ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడమంటే మామూలు విషయం కాదు. పాన్ ఇండియా ట్రెండ్ ముందు వరకు ఈ రికార్డు మహేష్ బాబు, ఎన్టీఆర్ ఖాతాలో మాత్రమే ఉంది. అది కూడా ఓవర్సిస్లో బాగా ఆడితేనే సాధ్యంమైంది. కానీ, రాజమౌళి పుణ్యమా అని పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక అది ఈజీ అయ్యింది. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు సైతం వందకోట్లు ఈజీగా కొట్టేస్తున్నారు.
ఇప్పుటికే నాని, సాయి దుర్గా తేజ్, సిద్దు జోన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేనిలు కూడా ఈ రికార్డు బ్రేక్ చేశారు. ఇక అగ్ర హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, బాలయ్య సంగతి చెప్పనవసరం లేదు. వరుసగా వీరి సినిమాలన్ని వంద కోట్ల క్లబ్లో చేరుతున్నాయి. అయితే ఇంతవరకు ఈ రికార్డు లేని అగ్ర హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఇప్పటి వరకు ఆయన సినిమాలు వంద కోట్లు సాధించింది లేదు. నిజానికి పవన్ లాంటి అగ్ర నటుడికి ఇది పెద్ద విషయం కాదు. కానీ, ఎందుకో పవన్ ఖాతాలో ఇప్పటి వరకు వంద కోట్ల సినిమా లేకపోవడం ఫ్యాన్స్ని తీవ్రంగా భాదిస్తోంది.
మీడియం రేంజ్ హీరోలు సైతం.. ఈ రికార్డు ఈజీగా కొట్టేస్తుంటే.. పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది పెద్ద కలగా మిగిలి ఉంది. ఈ కల ‘హరి హర ‘తో సాధ్యం అవుతుందని అంతా ఆశపడ్డారు. కానీ, అది కలగా మిగిలిపోయింది. ఈసినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ కీనసం వసూళ్లు కూడా తెచ్చిపెట్టలేకపోయింది. ఫైనల్గా ఈ సినిమా కొన్న బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. నిజానికి రిలీజ్కు ముందు HHVM మూవీకి ఉన్న హైప్ చూసి ఇది వెయ్యి కోట్ల సినిమా అనుకున్నారు. ఈ దెబ్బతో పవన్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ పడుతుందని ఆశపడ్డారు. కానీ, విడుదల తర్వాత అంచనాలన్ని తారుమారు అయ్యాయి.
Also Read: OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిముషాలే
మొత్తం థియేట్రికల్ రన్లో ఈ సినిమా కేవలం రూ. 87 కోట్ల నెట్ మాత్రమే చేసింది. కానీ, మూవీ బడ్జెట్ మాత్రం రూ. 300 కోట్లు. అంటే కనీసం ఈ సినిమా పెట్టిన డబ్బులు కూడా తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్, పవర్ స్టార్‌కి ఉన్న క్రేజ్కి ప్లాప్ సినిమా కూడా మినిమమ్ వసూళ్లు తీసుకురావాలి. అలాంటిదేం లేదు. అదే ప్రభాస్ ప్లాప్ సినిమా అయినా నిర్మాతలకు గట్టేస్తుంది. అది మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. కానీ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి అది సాధ్యం కాకపోవడం ఆలోచింపేలా చేస్తుంది. ఇప్పటి వరకు ఈ హీరో ఖాతాలో వందకోట్ల సినిమా లేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. కనీసం ఓజీతో అయినా అది సాధ్యం కావాలని ఇటూ ఫ్యాన్స్, అటూ పవన్ ఆశగా ఉన్నారు. మరి ఈ కల OG movie తో అయినా సాధ్యం అవుతుందా? లేదా? చూడాలి.