Jacqueline Fernandez:ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ పై ఉన్న రూ.215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఉపశమనం కోరుతూ.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు వైరల్ గా మారింది. తనపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన కేసును రద్దు చేయకూడదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని ఈమె సవాలు చేస్తున్నారు. ఈ కేసులో 215 కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను సహ నిందితురాలిగా పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ మేరకు ఈమె పిటిషన్ ను సోమవారం అనగా సెప్టెంబర్ 22న జస్టిస్ దీపాంకర్ దత్త, అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. 2022 ఆగస్టు 17న దాఖలు చేసిన ఈడి చార్జ్ షీట్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. సుఖేష్ చంద్రశేఖర్ నేర కార్యకలాపాల గురించి తెలిసినప్పటికీ.. చంద్రశేఖర్ నుండి విలాసవంతమైన బహుమతులు స్వీకరించడం కొనసాగించినట్లు తెలిపింది. అంతేకాదు నేరానికి సంబంధించిన పలు రసీదులను ఆమె దాచిపెట్టిందని, ఆధారాలను దాచడానికి ఫోన్ నుండి డేటాను కూడా క్లియర్ చేసినట్లు ఏజెన్సీ ఆరోపించింది.
సుఖేష్ కేసులో నటికీ తప్పని తిప్పలు..
ఇకపోతే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాత్రం ఈడి వ్యాఖ్యలను ఖండించింది. చంద్రశేఖర్ నేర నేపథ్యం గురించి తనకు తెలియదని, అతని నేర కార్యకలాపాలపై అవగాహన లేదు అని కూడా ఆమె తెలిపింది. ముఖ్యంగా 2022లో వెలువడిన వీరి ఫోటోలే విస్తృతమైన ఊహాగానాలకు ఆజ్యం పోసాయి. మరోవైపు చంద్రశేఖర్ జైలులో ఉన్నప్పటికీ ఆమెకు విలాసవంతమైన బహుమతులు, ప్రేమ లేఖలు పంపుతూనే ఉన్నాడని నివేదికలో సూచించడం గమనార్హం. ఇకపోతే సుకేష్ నేర కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బుతోనే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను మెప్పించడానికి సుమారుగా రూ.5.71 కోట్ల విలువైన బహుమతులను ఆమెకు అందించినట్లు ప్రకటించింది. మరి దీనిపై రేపు జరగబోయే విచారణలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాలి.
ALSO READ:Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?
జాక్వెలిన్ కెరియర్..
జాక్వెలిన్ విషయానికి వస్తే.. శ్రీలంకకు చెందిన ఈమె మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా మారింది. 2006లో శ్రీలంక తరపున మిస్ యూనివర్స్ పోటీకి వెళ్లి.. విజేతగా నిలిచింది. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈ శ్రీలంకలో కొంతకాలం టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేసింది. ఒక 2009లో అలాడిన్ అనే సినిమా ఆడిషన్స్ కోసం ఇండియాకు వచ్చిన ఈమె ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యి నటిగా మంచి పేరు దక్కించుకుంది. ఒకవైపు నటిగా ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు స్పెషల్ సాంగ్ లలో కూడా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ . ఇక హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె కన్నడ సినిమాలో కూడా నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ తో అబ్బురపరిచింది జాక్వెలిన్ . ఏది ఏమైనా ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె మనీ లాండరింగ్ కేసులో గత మూడు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం గమనార్హం