OTT Movie : కొరియన్ సిరీస్ లను తెగ చూసేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. వీటిని చూస్తూ డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా మార్చుకుంటున్నారు. అంతలా ఈ స్టోరీలు పాపులర్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కథలో తలమీద వచ్చే రెడ్ లైన్స్ వల్ల, వాళ్ళ అక్రమ సంబంధాలతో సహా అన్నీ తెలుసుకోవచ్చు. ఈ సిరీస్ లో వచ్చే ప్రతి ఎపిసోడ్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఇది 8వ కేన్స్ ఇంటర్నేషనల్ సిరీస్ ఫెస్టివల్‌లో బెస్ట్ మ్యూజిక్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘S Line’ 2025లో విడుదలైన కొరియన్ ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి అహ్న్ జూ-యంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో లీ సూ-హ్యూక్ (హాన్ జి-వూక్), అరిన్ (షిన్ హ్యూన్-హీప్), లీ డా-హీ (గ్యూ జిన్), లీ యూన్-సామ్ (కాంగ్ సీయాన్-ఆ) ప్రధాన పాత్రల్లో నటించారు. 6 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ఇది 2025 జూలై 11న దక్షిణ కొరియాలో Wavve ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అయింది, ఇండియాలో 2025 సెప్టెంబర్ 10 నుండి Amazon Prime Videoలో మలయాళం, తమిళ, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథలో ప్రజల అక్రమ సంబంధాలను రెడ్ లైన్స్ ద్వారా చూడవచ్చు. ఇవి వారి తలల మీద కనిపిస్తాయి. షిన్ హ్యూన్-హీప్ అనే ఒక హైస్కూల్ విద్యార్థిని, పుట్టుకతోనే ఈ లైన్స్ చూడగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివల్ల ఆమె తన కుటుంబంలోని బాధాకరమైన సంఘటనలను చూసి ఒంటరిగా ఫీల్ అవుతుంటుంది. హాన్ జి-వూక్ అనే ఒక డిటెక్టివ్, S Linesతో సంబంధం ఉన్న ఒక వింత హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ, స్పెషల్ గ్లాసెస్ ధరించి ఈ లైన్స్ చూస్తాడు. తన సొంత గతాన్ని కూడా చూసి షాక్ అవుతాడు. గ్యూ జిన్ అనే ఒక టీచర్, ఆశ్చర్యకరంగా ఎలాంటి S Line లేకుండా ఉంటుంది. ఆమె గతం కూడా ఒక మిస్టరీగా ఉంటుంది.
హ్యూన్-హీప్ స్నేహితురాలు సీన్-ఆ ఒక రూఫ్ టాప్ లో కోమాలోకి వెళ్తుంది. ఇది ఆమె S Line లతో సంబంధం ఉందని జి-వూక్ అనుమానిస్తాడు. జి-వూక్, హ్యూన్-హ్యూప్‌తో కలిసి, ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో జంగ్-వూ అనే ఒక టీచర్, తాను నిశ్చితార్థం చేసుకున్న స్త్రీ మోసం చేస్తున్నట్లు కళ్లద్దాల ద్వారా తెలుసుకుని, నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు. ఈ కళ్లద్దాలు చాలా మంది జీవితాలను గందరగోళంలోకి నెట్టివేస్తాయి. కథ ముందుకు సాగే కొద్దీ ఓ జంగ్-మిన్ అనే ఒక మాజీ మాథ్స్ టీచర్, S Line లతో సంబంధం ఉన్న హత్యలలో అనుమానితుడిగా ఉంటాడు.
ఈ సిరీస్ ఐదవ ఎపిసోడ్ వరకు, కథ ఒక గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంటుంది. కానీ ఆరవ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌తో జానర్ మారుతుంది. గ్యూ-జిన్ అనే హైస్కూల్ టీచర్ సాధారణ మానవురాలు కాదని, ఒక రకమైన అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది. ఆమె S Line ల ద్వారా మనిషి మెదడును మానిప్యులేట్ చేస్తుంది. ఆమె ఒక కల్ట్ లీడర్‌గా మారుతుంది. ఈ ట్విస్ట్ కథను ఒక డార్క్ ఫాంటసీ లోకి మారుస్తుంది. చివరికి గ్యూ-జిన్ కి, S Lines కి సంబంధం ఏమిటి ? జంగ్-మిన్ కి, హత్యలకు సంబంధం ఏమిటి ? హ్యూన్-హీప్, జి-వూక్ ఇన్వెస్టిగేషన్ లో నిగ్గుతేలే నిజాలు ఏమిటి ? అనే విషయాలను, ఈ కొరియన్ ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ