Big tv Kissik Talks: బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటి రాశి(Raasi) హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన సినీ కెరియర్ గురించి, అలాగే ప్రేమ పెళ్లి గురించి ఎన్నో విషయాలను అభిమానులతో ముచ్చటించారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాశి తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.. ఇక రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర సీరియల్ జానకి కలగనలేదు(Janaki Kalaganaledu) సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ లో బుల్లితెర నటుడు అమర్ దీప్(Amar Deep Chowdary), ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సీరియల్ లో రాశి అమర్ దీప్ తల్లి పాత్రలో నటించి సందడి చేశారు. ఇక పలు సందర్భాలలో అమర్ మాట్లాడుతూ రాశి గారు నాకు దేవుడిచ్చిన అమ్మ అంటూ తెలియచేశారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా రాశి కూడా అమర్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తనకు అమర్ మధ్య చాలా మంచి అనుబంధం ఏర్పడిందని నిజంగానే మా ఇద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం ఉందని తెలిపారు.
ఇప్పటికీ రామా అనే పిలుస్తా..
అమర్ ఫోన్ నెంబర్ తాను తన పేరు మీద సేవ్ చేసుకున్న ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పు రామా అంటూ మాట్లాడుతాను. నిజంగానే నాకు వాడు దేవుడిచ్చిన కొడుకు అంటూ రాశి తెలియజేశారు. ఇక అమర్ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని నాతో పంచుకోవాల్సిందే. వాడు కడుపు ఉబ్బరం తట్టుకోలేడని రాశి వెల్లడించారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లే ముందు కూడా నా దగ్గరకు వచ్చిన ఆశీర్వాదం తీసుకొని హౌస్ లోకి వెళ్లారని గుర్తు చేసుకున్నారు. ఇకపోతే మరోసారి అమర్ తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించడంతో అవుననే సమాధానం చెప్పారు.
బిగ్ బాస్ తరువాత అమర్ హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు మరొక సినిమాలో కూడా అమర్ హీరోగా నటిస్తున్నారు. అయితే అమర్ నటిస్తున్న సినిమాలో రాశి కూడా నటిస్తున్నారని, ఆ సినిమాలో కూడా తనకు తల్లిగా కనిపించబోతున్నాను అంటూ ఈ సందర్భంగా రాశి తెలియజేశారు.మరి ఆ సినిమా ఏంటీ అనే విషయాని మాత్రం వెల్లడించలేదు. ఇలా అమర్ గురించి తనతో ఉన్న అనుబంధం గురించి రాశి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈమె అనంతరం తదుపరి ఎలాంటి సీరియల్స్ ప్రకటించలేదు కానీ, ప్రస్తుతం రాశి పలు సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.
Also Read: Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!