RK Roja: మాజీ మినిస్టర్ ఆర్కే రోజా గురించి రెండు తెలుగు రాస్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గొంతుకు, మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. అందరూ రోజాను ఫైర్ బ్రాండ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు రోజా.. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతున్నారు అంటే ఆశ్చర్యం లేదు. ఇక జగన్ పార్టీ ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా రోజా ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎండగడూతూనే ఉంది. కొద్దిగా గ్యాప్ వచ్చినా కూడా ఆమె ఎవరినీ వదలకుండా ఏకీపారేస్తుంది.
రాజకీయాల గురించి పక్కన పెడితే ప్రస్తుతం రోజా.. ఒక చిన్న పిల్లల షోకు జడ్జిగా చేస్తుంది. ఇండస్ట్రీలో సినిమల తరువాత ఆమెను నిలబెట్టింది జబర్దస్త్. ఈ కామెడీ షో అంటే రోజా. రోజా అంటే జబర్దస్త్ అనేలా చేసింది. అయితే మంత్రిగా పదవిని చేపట్టాక జబర్దస్త్ నుంచి రోజా వెళ్ళిపోయింది. ఇక రోజా ఎక్కడ డ్యాన్స్ వేసినా.. ఏ షోలో కనిపించినా కూడా ఎంతోమంది ట్రోల్స్ చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ డ్యాన్స్ లు వేస్తావా.. ? సిగ్గులేదు అంటూ విమర్శించారు. తాజాగా ఆ విమర్శలకు రోజా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు చేయడం లేదా అని ప్రశ్నించింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా మాట్లాడుతూ.. ” ప్రజలు ఓటేసి గెలిపిస్తే షోలు చేస్తున్నావా అని నన్ను అడిగారు. ఇప్పుడు వారెందుకు సినిమాలు చేస్తున్నారు. మీకు ప్రజలు ఓటేసింది షూటింగులు చేసుకోవడానికా.. ? నేను చాలా చిన్న ఆర్టిస్ట్ ను. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను పని చేయాలని షూటింగ్స్ చేసుకుంటున్నాను. నా భర్తకు తోడుగా నేను కూడా సంపాదిస్తున్నాను. నా పిల్లలను చదివించాలి కాబట్టి నేను పని చేస్తున్నాను. మరి వాళ్లు స్టార్స్. ఎన్నో కోట్లు సంపాదించినవారు. మరి వాళ్లేందుకు ఇంకా షూటింగ్స్ చేస్తున్నారు. ఒక హీరోయిన్ గా ఒక ఈవెంట్ లో నేను డ్యాన్స్ చేయాల్సి వచ్చింది.
డ్యాన్స్ చేసేటప్పుడు 150 మంది యూనిట్ సభ్యులు ఉంటారు. నాతోపాటు తోటి ఆర్టిస్టులు ఉంటారు. ఆ టైమ్ లో డ్యాన్స్ బాగా చేసామా.. ? లేదా.. ? అందంగా కనిపిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆర్టిస్ట్ మైండ్ లో ఉంటుంది. వేరే బ్యాడ్ ఉద్దేశం ఎవరికీ ఉండదు. అది బాలకృష్ణకు తెలియదా.. ? పవన్ కళ్యాణ్ కు తెలియదా.. ? వాళ్ల మనుషులు మమ్మల్ని అన్నప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలుగా మీరెందుకు ఖండించలేదు. మీరేమో మీ మనవరాలి వయస్సు, మీ కూతురు వయస్సు ఉన్న హీరోయిన్లతో మీరు డ్యాన్స్ లు వేయడం, నడుములు పట్టుకోవడం, వెకిలి చెస్టలు చేయడం.. ఇవన్నీ అన్నీ ఛానెల్స్ లో ట్రోల్ అవుతున్నాయి కదా.
నడుము గిల్లుతారు.. వెనుక పిరుదుల మీద కొడతారు. ముందర వెళ్ళి చేతులతో కొడతారు. ఇవన్నీ వారు చేస్తే బావుంటాయి. వాళ్లు చేస్తే మంచిది. మేము చేస్తే బూతు. ఇలాంటివి మారాలి. యూట్యూబ్ లో ఇలాంటివి ఎవరు పెడుతున్నారో వారి తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పుతో కొట్టి మరీ బుద్దిచెప్పాలి. ఏ షోలో అయినా కూడా నన్ను నటిగానే చూస్తారు” అంటూ చెప్పుకొచ్చింది. డైరెక్ట్ గానే రోజా.. బాలకృష్ణ, ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేసిన దబిడీ దిబిడి సాంగ్ పై కామెంట్స్ చేసింది. మరి బాలయ్య ఫ్యాన్స్ రోజాకు రీకౌంటర్ ఎలా ఇస్తారో చూడాలి.