IND Vs PAK : ఆసియా కప్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ 4 దశలో దుబాయ్ వేదికగా తాజాగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. హోరా హోరీగా జరిగే సూపర్ 4 మ్యాచ్ రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. భారత జట్టును పరిశీలించినట్టయితే..టీమ్ లో ఎలాంటి మార్పు చేయలేదు. లీగ్ దశలో పాకిస్తాన్ తో ఆడిన జట్టునే ప్రకటించింది. పాకిస్తాన్ కూడా సేమ్ అదే టీమ్ ని కొనసాగించనుంది. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో కూడా అద్భుత ఫామ్ కనబరిచారు. మరోవైపు పాకిస్తాన్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. కానీ బ్యాటింగ్ విషయానికి వచ్చే సరికి పాక్ బ్యాటర్లు విఫలం చెందుతున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరు ఆధిక్యం సాధిస్తారో మరికొద్ది క్షణాల్లో తెలియనుంది.
Also Read : Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
మరోవైపు ఇవాళ టాస్ వేసే సమయంలో ఇవాళ కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈనెల 14న ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు రాద్దాంతం చేసింది. ఈ మ్యాచ్ లో తాము గెలిస్తే రాజకీయ వ్యాఖ్యలు చేసేందుకు పాకిస్తాన్ సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు పై భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. బలహీన మైన జట్టుతో ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో పాల్గొనడం పాకిస్తాన్ చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఈ జట్టుకు టీమిండియాతో ఆడే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ జట్టును అసోసియేట్ దేశాల జట్లతోనే ఆడించాలని సూచించారు. ఇకపై టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ లు జనాన్ని ఆకర్షించవని పేర్కొన్నారు. భారత్ పాక్ హోరా హోరీ సమరాలు చరిత్రే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే సానుకూలంగా స్పందించడడం విశేషం.
Also Read : IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
భారత జట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ వర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ జట్టు :
సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (c), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (wk), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.