E-Paper
Advertisement

టాక్సిక్ డైరెక్టర్ ముందు తీసిన సినిమాలు ఇవే.. ఒక్కోటి డిఫరెంట్!

టాక్సిక్ డైరెక్టర్ ముందు తీసిన సినిమాలు ఇవే.. ఒక్కోటి డిఫరెంట్!
Advertisement

Geetu Mohandas Movies:గీతూ మోహన్ దాస్… టాక్సిక్ సినిమా తీసిన ఈ డైరెక్టర్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్ గా మారుమ్రోగిపోతుంది . దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఊహించని వసూళ్లతో దూసుకెళ్లిపోతుండటం తో దర్శకత్వం వహించిన ఈ గీతూ ఎవరా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారంట.మరి ఈ గీతూ గతంలో ఏం సినిమాలు చేసిందో ఏంటో ఒకసారి మనము చూసేద్దాం.

మలయాళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా

గీతూ మోహన్ దాస్.. విషయానికి వస్తే మలయాళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన గీత ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించడం విశేషం.గీతు మోహన్ దాస్ చైల్డ్ ఆర్టిస్టుగా ఒన్ను ముతల్ పూజ్యం వరే అనే సినిమాతో 1986లో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత
ఎన్ బొమ్ముకుట్టి అమ్మవుక్కు,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,తెంకాశిపట్టణం,అకలే,రప్పకల్,నమ్మల్ తమ్మిల్,ఆకాశ గోపురం,నాలుపెన్నుంగల్,చూండ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా ,నటిగా సత్తా చాటింది.

ఏకంగా కేరళ స్టేట్ ఫిలిం అవార్డు

Advertisement

వీటిలో అకలే అనే సినిమాలో గీతూ నటనకి ఏకంగా కేరళ స్టేట్ ఫిలిం అవార్డు అలాగే బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు దక్కడం విశేషం .ఆ తర్వాత మమ్ముట్టి నయనతారలు కలిసి నటించిన రప్పకల్ అనే సినిమాలో మాళవికగా కనిపించి అలరించింది గీత మోహన్ . చివరగా 2009 లో వచ్చిన సీతాకళ్యాణం అనే సినిమాలో చివరిసారిగా నటించిన గీతూ మనసు క్రమంగా దర్శకత్వం వైపు మళ్ళింది.

కెల్కునుండు అనే షార్ట్ ఫిలిమ్ తో ప్రయాణం

గీతు అలా మొదటగా 2009లో కెల్కునుండు అనే షార్ట్ ఫిలిమ్ తో ప్రయాణం ప్రారంభించిన గీత మోహన్ 2013లో వచ్చిన లయర్ డైస్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించింది.నవాజుద్దీన్ సిద్దీకి , గీతాంజలి థాపా ప్రధాన కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందడం విశేషం .

2019లో నివిన్ పాల్ హీరోగా వచ్చిన మూతోన్

Advertisement

ఆ తర్వాత 2019లో నివిన్ పాల్ హీరోగా వచ్చిన మూతోన్ సినిమా ఆమె కెరీర్ లో మైల్ స్టోన్ అనే చెప్పాలి.ఇక ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా మంచి ఆదరణని సొంతం చేసుకుంది .

ఇక ఇప్పటివరకు డార్క్ షేడ్ లో సినిమాలు తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత మోహన్ ఇప్పుడు టాక్సిక్ అంటూ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని పట్టాలెక్కించింది.

కెరీర్ పై ఇలాంటి ప్రభావాన్ని చూపుతుందో!

గ్యాంగ్స్టర్ డ్రామా, యాక్షన్ ,ఎమోషన్స్… ఇలా అన్ని మిక్స్అప్ చేస్తూ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం . చూడాలి మరి ఏ టాక్సిక్ సినిమా ఫలితం గీతూ మోహన్ దాస్ కెరీర్ పై ఇలాంటి ప్రభావాన్ని చూపుతుందో!

Tags

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×