Star Actresses: సినీ ఇండస్ట్రీలో ఇటీవల ఎంతోమంది సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోయిన్స్ అమ్మలుగా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. తాజాగా నటించిన కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా దంపతులు కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ జంట మాత్రమే కాకుండా ఇదివరకు మొదటి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. మరి మొదటి సంతానంలో ఆడ బిడ్డకు(Baby Girl) జన్మనిచ్చిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…
రామ్ చరణ్ – ఉపాసన:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) ఉపాసన(Upasana) దంపతులు 2012వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ దంపతులు పెళ్లైన పది సంవత్సరాలకు తల్లితండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడబిడ్డ జన్మించారు ఈ చిన్నారికి క్లిన్ కారా(Klin Kaara) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కోరుకుంటున్న ఇప్పటివరకు వీరు మాత్రం తమ కూతురి ఫోటో రివీల్ చేయలేదు.
మనోజ్ -మౌనిక:
మంచు వారసుడిగా గుర్తింపు పొందిన మనోజ్ (Manoj)ఇటీవల పెళ్లి చేసుకుని తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈయన భూమా మౌనికను(Bhuma Mounika) రెండవ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు గత ఏడాది ఆడబిడ్డ జన్మించారు. ఈ చిన్నారికి శోభా దేవసేన (Shoba Devasena)అంటూ నామకరణం చేశారు.
రణవీర్ సింగ్ – దీపిక పదుకొనే:
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రణవీర్ సింగ్(Ranveer Singh), దీపిక పదుకొనే(Deepika Padukone) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరిది ప్రేమ వివాహం అయితే పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు వీరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. దీపిక గత ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి దువా(Dua) అని నామకరణం చేశారు. అయితే దీపిక పదుకొనే ఇప్పటివరకు తన కూతురి ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేయలేదు.
రణబీర్ కపూర్ – అలియా భట్:
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ జంటగా కొనసాగుతున్న వారిలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) అలియా భట్(Alia Bhatt) జంట కూడా ఒకటి. వీరిద్దరు ప్రేమించుకుని గత మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించారు. ఈ చిన్నారికి రాహా (Rahaa)అని నామకరణం చేశారు. ఈ చిన్నారి కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. రాహా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
కియారా – సిద్దార్థ్ మల్హోత్రా :
నటి కియారా అద్వానీ(Kiara Advani) సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) జంట గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంట తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు అయితే తమ చిన్నారి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మీడియాకు తెలియజేయలేదు తన కూతురికి ఫోటోలు వద్దని మీ అందరి దీవెనలు కావాలి అంటూ ఈ జంట మీడియాని రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్స్ అందరూ కూడా మొదటి సంతానంగా ఆడబిడ్డకు జన్మనివ్వటం విశేషం.
Also Read: The Girl Friend: రష్మిక సినిమా షూటింగ్ లో ప్రమాదం .. ఆలస్యంగా వెలుగులోకి?