Ghattamaneni:ఎన్టీఆర్ (NTR), ఏఎన్ఆర్(ANR ) కాలం నుంచే సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ జరుగుతూనే ఉంది. అదే హవా ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పవచ్చు. కాబట్టి సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. ముఖ్యంగా హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు కూడా తమ కొడుకులు, కూతుళ్లను సినీ అరంగేట్రం చేయడం కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక బడా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఒక వారసురాలు సిద్ధం అయ్యింది. నిజానికి ఈమె ఇండస్ట్రీ ఎంట్రీ అభిమానులకు ఆనందాన్ని కలిగించినా.. అత్త కోరికను ఈమె నెరవేరుస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన ఘట్టమనేని వారసురాలు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో ఘట్టమనేని కుటుంబం(Ghattamaneni family) కూడా ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తో మొదలైన సినీ ప్రస్థానం నేడు మహేష్ బాబు (Mahesh Babu) అదే రేంజిలో నిలబెట్టారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ కుటుంబం నుంచి హీరోలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు కానీ హీరోయిన్గా ఎవరు అడుగు పెట్టలేదు. గతంలో కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని (Manjula ghattamaneni) కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ కృష్ణ అభిమానులు అందుకు ఒప్పుకోలేదు. తమ అభిమాన నటుడి కూతురు ఒకరి దగ్గర పనిచేయడం తమకు ఇష్టం లేదని, చిట్టి పొట్టి బట్టలు వేసుకుని రొమాన్స్ చేయడం అంతకన్నా ఇష్టం లేదని, ఆమె కలలను మొగ్గలోనే తుంచేశారు. ఇక అభిమానుల కోరిక మేరకు కృష్ణ కూడా తన కూతుర్ని హీరోయిన్గా పరిచయం చేయడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో చేసేదేమీ లేక మంజుల అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ వచ్చింది.
ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధం..
ఇప్పుడు కాలం మారింది.. అభిమానులు కూడా అలాంటివన్నీ పక్కన పెట్టి హీరోయిన్లుగా చూడాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu) కూతురు భారతి ఘట్టమనేని(Bharathi ghattamaneni) ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దర్శకుడు తేజ (Teja) కుమారుడు హీరోగా, భారతీ ఘట్టమనేని హీరోయిన్గా అరంగేట్రం చేయబోతున్నారు అంటూ సినీ ఇండస్ట్రీలో ఒక వార్త జోరుగా నడుస్తోంది. దీనికి తోడు ఇటీవల భారతీ కూడా సోషల్ మీడియాలో “కుర్చీ మడతపెట్టి” పాటకు డాన్స్ చేసి అదరగొట్టేసింది. ఇందులో ఆమె గ్రేస్ చూసి ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటూ అందరూ కామెంట్లు కూడా చేశారు.
భారతి అత్త కలను నెరవేరుస్తుందా..?
ఇక ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే తేజ కుమారుడితో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది భారతి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. అటు తేజ కొడుకు విషయానికి వస్తే.. ఇప్పటికే ఆయన తండ్రి దర్శకత్వంలో బాల నటుడిగా కొన్ని చిత్రాలలో కనిపించారు. కానీ ఇప్పుడు హీరోగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. ఒక బడా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే కనీసం భారతి ఘట్టమనేని అయిన హీరోయిన్గా సక్సెస్ అయ్యి.. తన అత్త కలను నెరవేరుస్తుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.
also read: Film industry: అలా చేస్తేనే ఛాన్స్.. ఇండస్ట్రీ దిగజారుతోందంటూ హీరోయిన్ కామెంట్స్!