BigTV English

Film industry: అలా చేస్తేనే ఛాన్స్.. ఇండస్ట్రీ దిగజారుతోందంటూ హీరోయిన్ కామెంట్స్!

Film industry: అలా చేస్తేనే ఛాన్స్.. ఇండస్ట్రీ దిగజారుతోందంటూ హీరోయిన్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో ప్రతి ఒక్కరూ దీని బారిన పడుతున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని రోజులు కూడా ఉన్నాయి అని చాలామంది హీరోయిన్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రమ్యకృష్ణ (Ramya Krishnan), సమంత (Samantha ), అనుష్క(Anushka ) లాంటి హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని సంచలన కామెంట్లు చేశారు. ఇక రమ్యకృష్ణ అయితే ఏకంగా అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలి అనే రేంజ్ లో ఊహించని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకంగా అవకాశం కావాలి అంటే పక్కలోకి వెళ్లాల్సిందే అంటూ మరో హీరోయిన్ హాట్ కామెంట్స్ చేసింది. అందుకే ఇండస్ట్రీ దిగజారుతోంది అంటూ కూడా చెప్పడం ఇప్పుడు సంచలనానికి దారి తీసింది అని చెప్పవచ్చు. ఇక ఆమె ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్..

సాధారణంగా లైంగిక వేధింపులు అనేవి ఒక సినీ పరిశ్రమలోనే కాదు.. అన్ని రంగాలలో కూడా ఉంటాయి. కానీ సినీ పరిశ్రమ పబ్లిక్ కి చాలా చేరువలో ఉంటుంది కాబట్టి ఈ పరిశ్రమలో జరిగే ప్రతి విషయం కూడా ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. దీనికి తోడు చాలామంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీ పరిస్థితులపై నోరు విప్పుతున్నారు. అందులో భాగంగానే దర్శక నిర్మాతలు చెప్పినట్టు వినాల్సిందే అని.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నో కష్టాలను అధిగమించాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, వాటికి కారణమైన వ్యక్తులను కూడా బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.


అందుకే ఇండస్ట్రీ దిగజారుతోంది – చిత్రాంగద సింగ్

ఈ క్రమంలోని ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న చిత్రాంగద సింగ్ (Chitrangada Singh) కూడా సంచలన ఆరోపణలు చేసి మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉందని, తాను కూడా కొన్నిసార్లు అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను అని, అయితే వాటిని తిరస్కరించానని కూడా చెప్పుకొచ్చింది. చిత్రాంగద సింగ్ దీనిపై మాట్లాడుతూ..” సాధారణంగా ఎవరైనా లైంగిక ఆఫర్ ను అంగీకరించినప్పుడు అది వారి సొంత నిర్ణయం. ఎవరు వారిని జడ్జ్ చెయ్యరు. ముఖ్యంగా వారు ఇష్టపడితేనే క్యాస్టింగ్ కౌచ్ కి అంగీకరిస్తారు. కానీ సినిమా పరిశ్రమలో అలా కాదు.. ఈ రోజుల్లో దాదాపు ప్రతి చోటా కూడా లైంగిక ప్రయోజనాలను అడిగే వ్యక్తులే ఉన్నారు. ఇక సరైన నిర్ణయం అవసరమైన వారి చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ఎవరూ వారిని బలవంతం చేయరు. అవకాశం కావాలి అంటే కచ్చితంగా పక్క ఎక్కాల్సిందే” అన్నట్టుగా ఈమె కామెంట్లు చేసింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇలాంటి వారి వల్లే ఇండస్ట్రీ విలువ తగ్గిపోతుందని, పరిశ్రమ దిగజారుతోంది అంటూ కూడా హీరోయిన్ కామెంట్లు చేయడం గమనార్హం.

also read: Dhruv Vikram: ధ్రువ్ విక్రమ్ మామూలోడు కాదయ్యో.. ఏకంగా ముగ్గురితో రొమాన్స్!

Related News

War 2 Collections : ‘కూలీ’ కన్నా ‘వార్ 2’ కలెక్షన్స్ అంత తక్కువా.. వీకెండ్ కలిసివస్తుందా..?

Himaja: హిమజా లెమన్ టాస్క్.. నీళ్లు కిందపడకుండా ఆ నిమ్మకాయను పైకి తీయగలరా?

Coolie Collections : బాక్సాఫీస్ వద్ద ‘కూలీ ‘ జోరు.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?

Ram Charan: త్వరలో రంగస్థలం 2.. ఆ టార్గెట్ దిశగా చెర్రీ.. నిజమైతే బన్నీ తర్వాత స్థానం!

OG Movie : ‘ఓజీ ‘ పార్ట్ 2 ఉందా..? సుజిత్ ను నమ్మొచ్చా..?

Ghattamaneni: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఘట్టమనేని వారసురాలు..అత్త కల నెరవేరుస్తుందా?

Big Stories

×