Illu Illalu Pillalu ToIlluday Episode August 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. నగల షాప్ కి వెళ్లిన కామాక్షి అక్కడ శ్రీవల్లి ఇచ్చిన ఉంగరాన్ని ఇస్తుంది. డూప్లికేట్ అని తెలియడంతో షాక్ అయ్యి శ్రీవల్లిని అడగడానికి అరుస్తూ ఇంటికి వస్తుంది. శ్రీవల్లి మాత్రం నర్మద వాళ్ళు చూస్తే దొరికిపోతానని గదిలోకి తీసుకెళ్లి మాట్లాడుతుంది.. కచ్చితంగా మా నాన్నకు చెప్పాలని అనుకుంటున్నా అని అంటుంది.. భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా కామాక్షిని ఆపే ప్రయత్నం చేస్తారు. అది చూసిన ప్రేమ నర్మదా ఏమైందని అనుమానంతో ఆలోచిస్తూ ఉంటారు.. అమ్మ కామాక్షి ఎందుకు నువ్వు ఆవేశపడుతున్నావు.. పదా ఇలా రా లోపలికి రా అని ఇద్దరు బలవంతంగా కామాక్షిని లోపలికి తీసుకెళ్తారు.. లోపలికి వెళ్లి అసలు విషయం ఏంటో భాగ్యం తెలుసుకుంటుంది. ఈ కామాక్షి ని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది. డూప్లికేట్ ఉంగరాన్ని వేరే పని అమ్మాయిది అని చెప్పి తప్పించుకుంటుంది.. నర్మద ప్రేమలు శ్రీవల్లి నగల విషయం ఏదో తేల్చాలని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అడుగుతారు. దానికి రామరాజు సరే అంటాడు. వేదవతి నా కోడలు మొత్తానికి పంతాన్ని నెగ్గించుకున్నారు అనుకున్నది అనుకున్నట్లయితే చేయబోతున్నారని సంతోషపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు వ్రతం అంటున్నారు కదా చేస్తే మంచిదే కదా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంటాడు. వేదవతి నా కోడలు అనిపించుకున్నారు. ఏదైనా అనుకుంటే సాధించే తీరుతారు కదా అని కోడలను చూసి మురిసిపోతూ ఉంటుంది.. అయితే భాగ్యం శ్రీవల్లి వెళ్ళిపోతుంటే నర్మదా వాళ్ళని పిలుస్తుంది. వాళ్లు ముగ్గురు షాక్ అవుతారు. బల్లి అక్క రేపు వ్రతం అంట మర్చిపోవద్దు అని నర్మదా అంటుంది..
అవునక్కా నువ్వెందుకు రేపే వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలని అనుకుంటున్నావు అని ప్రేమ అడుగుతుంది. ఏం లేదు ప్రేమ వీళ్ళిద్దరూ నగల విషయంలో ఏదో చేస్తున్నారు కదా.. దాన్ని ఎలాగైనా బయట పెట్టాలని నేను అనుకుంటున్నాను అని నర్మదా అంటుంది. వరలక్ష్మీ వ్రతంలో వాళ్ల నగలు డబ్బులను ప్రతి ఒక్కరు అక్కడ పెడతారు. అయితే వల్లి అక్క కూడా ఆ నగలని పూజలు పెట్టాలి. వేరే కారణాలు చెప్తే నగలు తీసుకురారు.. ఇలా చేస్తేనే ఖచ్చితంగా నగలని తీసుకొస్తారు అని అంటుంది నర్మదా. అవునక్కా నువ్వు చెప్పింది నిజమే..
ఈ వ్రతం అడ్డుపెట్టుకొని ఇవాళ బండారు అని మనం బయట పెడదామని అంటుంది ప్రేమ.. ఇక ముగ్గురు కోడలు కలిసి ఇంట్లో పూజ చేయడం చూసి ముగ్గురు అన్నదమ్ములు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వీళ్ళ ముగ్గురి కోసం మనం కచ్చితంగా చీరలు కొనాలి. ఈరోజు వరలక్ష్మీ వ్రతం కదా ముగ్గురు చీరలు కట్టుకొని పూజ చేస్తే చాలా బాగుంటుంది అని షాప్ కి వెళ్లి చీరలను సెలెక్ట్ చేసే పనిలో ఉంటారు. అయితే నర్మదకు చందు చీరని సెలెక్ట్ చేస్తే.. వల్లికి సాగరు చీరని సెలెక్ట్ చేస్తాడు.. అలాగే ధీరజ్ కి ఇద్దరు అన్నదమ్ములు కలిసి చీరని సెలెక్ట్ చేసి ఇస్తారు.
నర్మద కోసం కొన్న చీరని సాగర్ తీసుకుని నర్మదకు ఇవ్వాలని ఎంతో ఆశతో వస్తాడు. నర్మద మాత్రం ఆ చీరను చూసిచూనట్టుగా ఉంటుంది. ఏమైంది ఎందుకు నువ్వు అలా ఉన్నావు అని సాగర్ అడుగుతాడు. నేనెందుకు ఇలా ఉన్నాను మీకు తెలియదా.. మనసులో లేని ప్రేమను ఇలా చీరల రూపంలో వస్తువులు రూపంలో కొనిస్తే ఉంటుందా అని నర్మదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నర్మదా నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మరి ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అని అంటాడు సాగర్..
Also Read: పల్లవికి వార్నింగ్ ఇచ్చిన భానుమతి.. ప్రణతికి తెలిసిన నిజం.. పెళ్లి ఆగిపోతుందా..?
దానికి నర్మదా అందుకేనా నడిరోడ్డు మీద నేను పిలుస్తున్న కూడా పట్టించుకోకుండా వెళ్లి నన్ను ఏడ్చేలా చేసావని నర్మదా అంటుంది. అప్పుడు పరిస్థితులు వేరు నువ్వు ఆ పరిస్థితులను అర్థం చేసుకోవాలి అని సాగర్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి అందరూ కలిసి వరలక్ష్మీ వ్రతానికి రెడీ అయ్యి పూజకు సిద్ధం చేస్తారు. మరి శ్రీవల్లి నర్మద ప్లాన్ లో ఇరుక్కుంటుందా..? లేదా బయట పడుతుందా చూడాలి…