Bigg Boss 10 Telugu Day 69 Promo 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వ కార్యక్రమంలో భాగంగా నేటితో 10 వారాలు పూర్తి కాబోతున్నాయి. ఇక పదవ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ కావడంతో పెద్ద ఎత్తున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఈ వారం మొత్తం బిగ్ బాస్ కార్యక్రమం చాలా సంతోషంగా ఎమోషన్స్ తో పూర్తీ అయింది. ఫ్యామిలీ వీక్ లో భాగంగావర్షిణి (Varshini)రామకృష్ణ(Ramakrishna)కు మినహా మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యామిలీ అంతా హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే నేడు బిగ్ బాస్ ఊహించని విధంగా వర్షిణి అమ్మను కూడా హౌస్ లోకి పంపించారు.
రామకృష్ణ అలాగే వర్షిణి ఇద్దరి పేరెంట్స్ ని తీసుకువచ్చారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వేస్తారో వాళ్ళ పేరెంట్స్ మాత్రమే హౌస్ లోకి వెళ్తారని చెప్పగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఏడు మంది వర్షిణికి సపోర్ట్ చేయడంతో ఆమె హౌస్ లోకి వెళ్లారు. రామకృష్ణకు నిరాశ ఎదురయింది. ఇలా వర్షిణి మదర్ హౌస్ లోకి వెళ్లడంతో తన అమ్మను చూడగానే వర్షిణి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం వర్షిణి మదర్ రామకృష్ణకు క్షమాపణలు చెప్పారు. తన వల్ల రామ కృష్ణ మదర్ హౌస్ లోకి రాలేకపోవడంతో ఆమె క్షమాపణలు చెప్పారని తెలుస్తుంది.
ఇక వర్షిణి మదర్ తన కూతురితో గార్డెన్ ఏరియాలో మాటాడుతూ ఈ వారం నామినేషన్ లో అదరగొట్టావని తన కూతురి ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు. అనంతరం కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కోసం నేను ఆడుతున్నాను అనే విధంగానే మీరు ఆట ఆడండి.. మీలో మీరు కొట్టుకోండి కానీ మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అంటూ వర్షిని అమ్మ చెప్పిన ఈ మాటలతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు.
ఇక వర్షిణి తన అమ్మ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న సమయంలో తన కాళ్లకు నమస్కారం చేశారు. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ ఇది తనకు ఒక అలవాటు అంటూ చెప్పారు. అనంతరం ఎందుకో ముఖేష్ కి కూడా అని తన ఏదో చెప్పబోతున్న నేపథ్యంలో వర్షిణి ఒక్కసారిగా తన అమ్మ మాట్లాడకుండా తన నోటికి చెయ్యి అడ్డుపెట్టారు.అయితే వర్షిణి అమ్మ వర్షిణి ముకేష్ కాళ్లకు నమస్కరించడం గురించి మాట్లాడారని అందుకే మాట్లాడకుండా వర్షిణి అడ్డుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈవారం ఎలిమినేషన్ లో భాగంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హౌస్ నుంచి శనివారం ఎపిసోడ్లో భాగంగా రామకృష్ణ ఎలిమినేట్ కాబోతున్నట్టు సమాచారం.
Also Read: గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?