E-Paper
Advertisement

23 ఏళ్లకే రూ.40 వేల కోట్ల సామ్రాజ్యం.. ఇద్దరు కుర్రాళ్ల ప్రపంచ రికార్డు!

23 ఏళ్లకే రూ.40 వేల కోట్ల సామ్రాజ్యం.. ఇద్దరు కుర్రాళ్ల ప్రపంచ రికార్డు!
Advertisement

Mercor Founders: 23 ఏళ్ల వయసులో మీరు ఏం చేస్తున్నారు? చాలామంది ఇంకా చదువుకుంటుంటారు.. కొందరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు.. మరికొందరు తమ కెరీర్ ఏంటో కూడా నిర్ణయించుకోలేక డైలమాలో ఉంటారు. కానీ ఇద్దరు భారతీయ మూలాలున్న యువకులు మాత్రం ఇదే 23 ఏళ్ల వయసులో ఏకంగా 40 వేల కోట్ల సంపదకు అధిపతులయ్యారు. అదీ ఏదో వారసత్వంగా వచ్చిన ఆస్తితోనో.. కుటుంబ వ్యాపారంతోనో కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. అంటే AI టెక్నాలజీని నమ్ముకుని సొంతంగా ఓ స్టార్టప్ ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ అక్షరాలా రూ.1.88 లక్షల కోట్లు. వాళ్లే ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా. అసలు వీళ్ల సక్సెస్ స్టోరీ ఏంటి? ఇంత చిన్న వయసులోనే ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎలా చేరారో తెలుసుకుందాం.

23 ఏళ్లకే రూ.40,000 కోట్ల సామ్రాజ్యం

Advertisement

బ్రెండన్‌ ఫూడీతో కలిసి ఆదర్శ్, సూర్య స్థాపించిన కంపెనీ పేరు మెర్కర్. ఈ AI స్టార్టప్ ఏకంగా 750 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 వేల కోట్లకు పైమాటే. ఈ ఫండింగ్‌తో కంపెనీ విలువ ఒక్కసారిగా 20 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే సుమారు రూ.1.88 లక్షల కోట్లు. ఇక ఫోర్బ్స్ అంచనాల ప్రకారం కంపెనీ ముగ్గురు కో-ఫౌండర్లలో ఒక్కొక్కరి సంపద సుమారు 4.2 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.40 వేల కోట్లు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉండేది. కేవలం ఏడాదిలోనే అది రెట్టింపై 20 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో వారి సంపద కూడా దాదాపు డబుల్ అయ్యింది.

మూడు ప్రధాన జాతీయ స్థాయి పాలసీ డిబేట్ టోర్నమెంట్లలో విజయం

Advertisement

ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా.. వీరిద్దరూ అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లోని శాన్‌జోస్‌లో ఉన్న బెల్లార్మిన్ కాలేజ్ ప్రిపరేటరీ స్కూల్‌లో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే వీరిద్దరికీ డిబేట్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్ డిబేట్ టీమ్‌లో మెంబర్స్‌గా ఉండేవారు. అయితే వీళ్ల ప్రతిభ సాధారణమైనది కాదు. ఒకే ఏడాదిలో మూడు ప్రధాన జాతీయ స్థాయి పాలసీ డిబేట్ టోర్నమెంట్లలో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఆ స్కూల్ చరిత్రలో ఇలా సాధించిన తొలి జట్టుగా నిలిచారు. ఆ తర్వాత సూర్య మిధా జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో చేరారు. ఆదర్శ్ హిరేమత్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. కానీ ఒక దశలో వీళ్లిద్దరూ రోటిన్‌గా చదవడం కంటే బిజినెస్‌ ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హిరేమత్ రెండేళ్ల తర్వాత హార్వర్డ్‌ను విడిచిపెట్టగా, మిధా కూడా చదువుకు బ్ఏక్ ఇచ్చి ఇచ్చి స్టార్టప్ స్టార్ట్ చేశారు. వీళ్లతో పాటు మూడో కో-ఫౌండర్ బ్రెండన్ ఫూడీ కూడా ఈ జర్నీ స్టార్ట్ చేశాడు. ముగ్గురూ ప్రతిష్ఠాత్మకమైన పీటర్ థీల్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం కింద సంప్రదాయ కాలేజీ చదువును పక్కనపెట్టి వ్యాపార ఆలోచనలపై పనిచేసే యువ పారిశ్రామికవేత్తలకు లక్ష డాలర్ల వరకు ఆర్థిక సహాయం అందుతుంది.

ఇంత విలువైన కంపెనీ అసలు ఏం చేస్తుంది?

మరి ఇంత విలువైన కంపెనీ అసలు ఏం చేస్తుంది? అనే కదా మీ డౌట్. AI అంటే చాలామందికి చాట్‌బాట్లు, ఫోటోలు, వీడియోలు గుర్తొస్తాయి. కానీ ఒక AI మోడల్‌ను నిజంగా తెలివైనదిగా మార్చాలంటే దానికి నాణ్యమైన డేటా, ఎక్స్‌పర్ట్‌ డైరెక్షన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక AI మోడల్ మెడికల్ రంగంలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే దానికి మెడికల్ విషయాలపై నాలెడ్జ్ ఉండాలి. లీగల్ డాక్యుమెంట్లను విశ్లేషించాలంటే లీగల్ అంశాలపై అవగాహన అవసరం. ఫైనాన్స్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లోనూ ఇదే సిచ్యూవేషన్. ఇక్కడే మెర్కర్ రంగంలోకి దిగుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్‌, ఇంజినీర్ల వంటి ప్రత్యేక స్కిల్స్‌ కలిగిన వ్యక్తులను AI కంపెనీలతో లింక్ చేస్తుంది. వీరంతా AI మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాను డెవలప్ చేస్తారు. వాటి సమాధానాలు ఎంత కచ్చితంగా ఉన్నాయో టెస్ట్ చేస్తారు. ఎక్కడ తప్పులు చేస్తున్నాయో గుర్తించి మెరుగుపరచడంలో సహాయపడతారు.

27 నెలల్లోనే .. మిలియన్ డాలర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు..

సింపుల్‌గా చెప్పాలంటే.. మనుషుల్లో ఉన్న నైపుణ్యాన్ని AIకి మరింత మెరుగైన శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే ప్లాట్‌ఫామ్ అన్నమాట. 2023లో ప్రారంభమైన మెర్కర్ మొదట అమెరికా కంపెనీలకు ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లను అందించే రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా మొదలైంది. ఆ తర్వాత AI రంగంలో నిపుణుల అవసరాన్ని గుర్తించి తన వ్యాపారాన్ని విస్తరించింది. Open AI, Anthropic వంటి ప్రముఖ AI సంస్థలతోనూ పనిచేసింది. ఇక మెర్కర్ ఎదుగుదల చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే. కేవలం 27 నెలల్లోనే సంస్థ వార్షికీకరించిన ఆదాయ రన్‌రేట్ ఒక మిలియన్ డాలర్ నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకు చేరిందని ప్రస్తుతం కంపెనీ CEOగా బ్రెండన్ ఫూడీ చెబుతున్నాడు. కేవలం 27 నెలల్లోనే కంపెనీ వార్షిక ఆదాయ అంచనా ఒక మిలియన్ డాలర్ నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. అంటే ఏడాదికి సుమారు రూ.26 వేల కోట్ల ఆదాయం సాధించే స్థాయికి చేరిందన్నమాట. ఒక్క నెలలోనే 250 మిలియన్ డాలర్ల గ్రాస్ సేల్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. అంతేకాదు.. కంపెనీ కస్టమర్ల సంఖ్య కూడా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపై 100 దాటింది.

ప్రముఖ సంస్థలు ఇన్వెస్ట్‌లు..

ఈ డెవలప్‌మెంట్‌ను చూసిన Benchmark, General Catalyst, Nvidia, Salesforce, Zoom వంటి ప్రముఖ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. తాజాగా వచ్చిన పెట్టుబడులను AI మోడళ్ల పనితీరును అంచనా వేయడం, వాటిని మరింత మెరుగుపరచడం, కంపెనీల కోసం AI ఏజెంట్లను అభివృద్ధి చేయడం వంటి వాటికి ఉపయోగించనున్నారు.

ప్రపంచ AI పరిశ్రమలో కీలకమైన స్టార్టప్

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. వీళ్లు ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో పుట్టలేదు. కానీ స్కూల్ రోజుల నుంచే ఒక ఆలోచనను నమ్మారు. తమ స్కిల్స్‌ను పెంచుకున్నారు. సరైన అవకాశాన్ని గుర్తించారు. ఆ ఆలోచనను వ్యాపారంగా మార్చారు. ఒకప్పుడు డిబేట్ పోటీల్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు.. ఇప్పుడు ప్రపంచ AI పరిశ్రమలో కీలకమైన స్టార్టప్ ఫౌండర్లుగా ఎదిగారు. ఏదేమైనా.. భవిష్యత్తు టెక్నాలజీ రంగంలోనే ఉందని మరోసారి నిరూపిస్తున్న ఈ యువకుల ప్రయాణం స్టార్టప్ కలలు కనే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ఇన్‌స్పిరేషన్. వయసు చిన్నదైనా.. ఆలోచన పెద్దదైతే ప్రపంచమే మన మార్కెట్ అవుతుంది.

Also Read: పాతదే మళ్లీ ఫ్యాషన్.. Vintage Cultureకి ఫిదా అవుతున్న Gen Z!

Tags

Related News

ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోండి..కేవలం నిమిషాల్లో పని పూర్తి!

సీసీ కెమెరా కాకుండా ఇంటి సేఫ్టీ కోసం..ఈ స్మార్ట్ గాడ్జెట్లు బెస్ట్

షారుఖ్ వాచ్ ధర రూ.1.8కోట్లు..ప్రపంచంలో 22 మంది దగ్గరే ఉన్నఈ రేర్ పీస్ ప్రత్యేకతలివే!

యాపిల్ బిగ్ ట్విస్ట్.. సెప్టెంబర్‌లో iPhone 18 రావట్లేదట, మరెప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

చిప్స్ ప్యాకెట్లు కొంటారు కానీ రీఛార్జ్‌కు ఎందుకు ఆలోచిస్తున్నారు? ధరల పెంపుపై ఎయిర్‌టెల్ అధినేత షాకింగ్ కామెంట్స్!

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

Big Stories

Advertisement
×