E-Paper
Advertisement

సెట్‌లో కాస్టింగ్ కౌచ్, దివ్యభారతికి అవమానాలు.. ‘గోట్’ వివాదంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

సెట్‌లో కాస్టింగ్ కౌచ్, దివ్యభారతికి అవమానాలు.. ‘గోట్’ వివాదంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
Advertisement

GOAT Movie: సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న గోట్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా అదే స్థాయిలో కాంట్రవర్సీలకి కేరాఫ్ అవుతుంది. నవంబర్ 12 న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్టు ఫ్లాప్ లని పక్కకి పెడితే సినిమా షూటింగ్ లో ఎదురైన కష్టాలు, హీరోయిన్ దివ్యభారతికి జరిగిన అవమానాలు, సోషల్ మీడియా ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్ అంటూ రకరకాల వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.

అసలు ఇష్యూ అంతా హీరోయిన్ దివ్యభారతి, దర్శకుడి మధ్య వచ్చిన గ్యాప్ తోనే అని తెలిపారు. షూటింగ్ టైంలో దివ్యభారతికి సరైన టైంకి డైలాగ్స్ ఇవ్వకపోవడం, షెడ్యూల్స్ గురించి ముందే చెప్పకపోవడం వల్ల ఆమె చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. హీరోయిన్లు మేకప్, నగలు, కాస్ట్యూమ్స్ వేసుకుని గంటలు గంటలు సెట్‌లో ఖాళీగా ఉండటం చాలా కష్టమని, ముందే డైలాగ్స్ రెడీగా ఉంచాలని ఆమె కో-డైరెక్టర్‌కు కూడా చెప్పారని గుర్తు చేశారు.అయితే సెట్‌లో ఆమె మాటలను ఎవరూ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఆమె బాగా హర్ట్ అయ్యారని తెలిపారు.

Advertisement

పైగా ఒక పాట రిలీజ్ అయినప్పుడు దర్శకుడు సోషల్ మీడియాలో దివ్యభారతిని ట్రోల్ చేస్తూ, ఆమె పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసిందని తెలిపారు.అంతకుముందు దర్శకుడు తనపై, తన ప్రొడక్షన్ హౌస్‌పై పోస్టులు పెట్టినప్పుడు తాను పెద్దగా పట్టించుకోలేదని కానీ, ఒక ప్రొఫెషనల్‌గా సినిమా చేసిన హీరోయిన్‌ను పర్సనల్‌గా టార్గెట్ చేయడం అస్సలు నచ్చలేదని వాపోయాడు.

అయితే తనపై నమ్మకంతో సినిమా చేసినందుకు ఆమెకు అండగా నిలబడటం తన బాధ్యత అని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, దివ్యభారతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వేలల్లో నెగెటివ్ ట్వీట్లు రావడం వెనుక కచ్చితంగా ఒక పీఆర్ క్యాంపెయిన్ ఉందని నమ్ముతున్నానని చెప్పారు.

Advertisement

దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోయామని చెప్పారు. అయితే తమిళ ఇండస్ట్రీ, మహిళా సంఘాల నుంచి దివ్యభారతికి ఫుల్ సపోర్ట్ దొరికిందని, ఉచితంగా లీగల్ హెల్ప్ చేస్తామన్నా తన పర్సనల్ లైఫ్ మరింత రచ్చ కాకూడదనే ఉద్దేశంతో ఆమె కేసు పెట్టలేదని వివరించారు.

ఇక కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సినిమా మొదలైన కొత్తలో సెట్‌లో ఒక టాప్ టెక్నీషియన్ కాస్టింగ్ కౌచ్‌ చేశాడనే ఆరోపణలపై సమాధానమిస్తూ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ విషయం తన దృష్టికి రాలేదని, అప్పుడే తెలిసుంటే కచ్చితంగా యాక్షన్ తీసుకునేవాడినని అన్నారు.

సినిమా పూర్తయ్యాక వేరే టీమ్‌తో పనిచేస్తున్నప్పుడు ముగ్గురు నలుగురు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని, దానికి సంబంధించిన వీడియో కూడా పంపించారని చెప్పుకొచ్చారు.ఇది చాలా సీరియస్ విషయమని, బాధితులు కంప్లైంట్ ఇస్తే తాను కచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పారు.చూడాలి మరి ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో !

also read :ఖరీదైన వాచ్‌తో జాన్వీ కపూర్ సందడి.. ఫ్యాషన్ లవర్స్ ఫిదా!

Tags

Related News

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లా? విశ్వక్ సేన్ ఏమన్నారంటే!

గదిలో వర్మ చేసిన పని చూసి షాకయ్యా.. ఆర్జీవీ సీక్రెట్ బయటపెట్టిన శివ నాగేశ్వరరావు!

ఖరీదైన వాచ్‌తో జాన్వీ కపూర్ సందడి.. ఫ్యాషన్ లవర్స్ ఫిదా!

విజయశాంతి పాటతో రష్మిక రచ్చ.. మైసాలో అదిరిపోయే సర్‌ప్రైజ్!

చిరంజీవి లేఖతో కదిలిన కేంద్రం.. డీప్‌ఫేక్, మార్ఫింగ్‌పై కొత్త చట్టానికి కిషన్ రెడ్డి సంకేతం

‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ వెనుక అసలు కథ.. టీమ్ ఆన్సర్స్ వింటే నవ్వాల్సిందే!

ఫోన్ స్విచ్ఛాఫ్.. బ్లాక్‌మెయిలింగ్.. గోట్ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది?

Big Stories

Advertisement
×