E-Paper
Advertisement

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లా? విశ్వక్ సేన్ ఏమన్నారంటే!

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లా? విశ్వక్ సేన్ ఏమన్నారంటే!
Advertisement

ENE Repeat:విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ENE రిపీట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపోతుంది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్‌గా నిర్వహించింది మూవీ టీమ్.ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఈ మధ్య సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదో ఒక పేరు పెట్టి ఈవెంట్స్ చేస్తుంటారని కాని తానూ మాత్రం ఇప్పుడే పెట్టానని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి.

ఈవెంట్‌లో మాట్లాడిన విశ్వక్ సేన్, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇప్పుడు సక్సెస్ మీట్లు పెట్టుకుంటున్నారని, కానీ ఆ రోజు నుంచి తాను మాత్రం ఎప్పుడూ సక్సెస్ మీట్ పెట్టుకోలేదని, ఇప్పుడే పెట్టుకున్నామని చెప్పడంతో ఆడిటోరియం గొల్లుమంది. అంటే ఇండస్ట్రీలో చాలా మంది రిజల్ట్‌తో సంబంధం లేకుండా హడావిడి చేస్తుంటారని విశ్వక్ ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడన్న మాట.

Advertisement

సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్లు, ఆడియెన్స్ రియాక్షన్ చూసి సెలబ్రేట్ చేయడం సహజమే అయినా, ఈ మధ్య ప్రతి సినిమాకూ అలాంటి సక్సెస్ మీట్స్ చేయడం చాలా కామన్ అయిపొయింది. దీంతో ఇపుడు విశ్వక్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

విశ్వక్ సేన్ విషయానికి వస్తే టాలీవుడ్ లో తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరని చెప్పుకోవచ్చు. కమర్షియల్ సినిమాలే కాకుండా, కొత్త కాన్సెప్ట్‌లు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి విశ్వక్ ముందుంటాదాని చెప్పక్కర్లేదు. యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు కూడా. వెళ్లిపోమాకే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’ లాంటి సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయాడు.

Advertisement

ముఖ్యంగా ‘హిట్’ సినిమా తర్వాత విశ్వక్ సేన్‌కు మంచి పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. అయితే గత కొంతకాలంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఫంకీ ,కల్ట్ వంటి సినిమాలు విశ్వక్ కి దమ్కీ ఇచ్చినవే .ఎట్టకేలకి ‘ENE రిపీట్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 20 కోట్ల గ్రాస్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది.మొత్తానికి హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న విశ్వక్ కి ఈ సినిమా రిలీజ్ ఇచ్చిందన్న మాట !చూడాలి మరి ముందు ముందు ఇదే సక్సెస్ స్ట్రీక్ ఇలాగే కంటిన్యూ చేస్తాడా లేక మళ్ళీ తలా తోకా లేని సినిమాలతో ఎప్పటిలాగే ప్లాపులతో సావాసం చేస్తాడా !

ALSO READ:గదిలో వర్మ చేసిన పని చూసి షాకయ్యా.. ఆర్జీవీ సీక్రెట్ బయటపెట్టిన శివ నాగేశ్వరరావు!

Tags

Related News

గదిలో వర్మ చేసిన పని చూసి షాకయ్యా.. ఆర్జీవీ సీక్రెట్ బయటపెట్టిన శివ నాగేశ్వరరావు!

సెట్‌లో కాస్టింగ్ కౌచ్, దివ్యభారతికి అవమానాలు.. ‘గోట్’ వివాదంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ఖరీదైన వాచ్‌తో జాన్వీ కపూర్ సందడి.. ఫ్యాషన్ లవర్స్ ఫిదా!

విజయశాంతి పాటతో రష్మిక రచ్చ.. మైసాలో అదిరిపోయే సర్‌ప్రైజ్!

చిరంజీవి లేఖతో కదిలిన కేంద్రం.. డీప్‌ఫేక్, మార్ఫింగ్‌పై కొత్త చట్టానికి కిషన్ రెడ్డి సంకేతం

‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ వెనుక అసలు కథ.. టీమ్ ఆన్సర్స్ వింటే నవ్వాల్సిందే!

ఫోన్ స్విచ్ఛాఫ్.. బ్లాక్‌మెయిలింగ్.. గోట్ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది?

Big Stories

Advertisement
×