Janhvi Kapoor:జాన్వీ కపూర్ …అతి లోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఒక వైపు వరుస సినిమాలతో అలరిస్తూనే మరోవైపు క్రేజీ పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తుంది.ఈ క్రమంలోనే ఈ భామ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పుడూ తన గ్లామర్ పైనో ,వేసుకున్న కాస్ట్యూమ్స్ పైనో ఫోకస్ పెట్టె ఈ అమ్మడు ఇపుడు తన చేతికి ఉన్న వాచ్ పై ఫోకస్ పెట్టడం విశేషం.
ఇక ఇన్ స్టాలో షేర్ చేసుకున్న ఫోటోకి ‘The little detail that completes the look’ అని క్యాప్షన్ అని పేరు పెట్టడంతో అందరి దృష్టి ఈ ఫోటోపై పడింది. అలాగే ప్రముఖ వాచ్ కంపెనీ Baume & Mercier ని కూడా ట్యాగ్ చేయడం విశేషం. ఇక ఎప్పుడూ తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకునే జాన్వీ, ఈ ఫోటోలో బ్లాక్ డ్రెస్ వేసుకుని చాలా క్లాసీగా కనిపించిందనడంలో సందేహం లేదు.దానికి తోడు చేతికి పెట్టుకున్న సిల్వర్ కలర్ వాచ్ ఆమె లుక్‌కు అందాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి.
ఈ ఫోటోలో తను ఇచ్చిన పోజ్ కూడా చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంది. ఒక చేతిని ముఖం దగ్గర పెట్టుకుని కెమెరా వైపు చూస్తూ ఎలాంటి హడావుడి లేకుండా నింపాదిగా ఫోటో దిగింది. సాధారణంగా చాలామంది హీరోయిన్లు ఫోటోషూట్స్ అంటే పెద్ద పెద్ద నగలు, గ్రాండ్ డ్రెస్సులతో కనిపిస్తుంటారని స్పెషల్ గా చెప్పక్కర్లేదుకానీ జాన్వీ మాత్రం సింపుల్‌గా ఒక చిన్న వాచ్ కూడా లుక్‌ను ఎంత గ్రాండ్ గా మార్చేస్తుందో ఈ ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసింది.
ఇక జాన్వీ సినిమా కెరీర్ విషయనికి వస్తే శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చినా, తనకంట గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది ఆ అందాల భామ.అందులో భాగంగా మొదటిసారి మరాఠీ హిట్ సినిమా సైరాట్ రీమేక్‌గా వచ్చిన ధడక్ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సినిమాతో మరింత క్రేజ్ కొట్టేసింది .ఇక ఆ క్రమంలోనే రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలీ, బవాల్ లాంటి సినిమాలతో రకరకాల పాత్రలు చేస్తూ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది ఈ బీటౌన్ బ్యూటీ.
ముఖ్యంగా మిలీ సినిమాలో ఒక చిన్న గదిలో ఇరుక్కుపోయిన అమ్మాయి పాత్రలో అదరగొట్టిన జాన్వీ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టోరీలో నటించి సత్తా చాటింది. ఇక తెలుగులో దేవర సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన ఈ అమ్మడు పెద్ది సినిమాతో సక్సెస్ పక్కన పెడితే గ్లామర్ షోతో వివాదాలకి కేరాఫ్ అయ్యింది.
మొత్తంగా ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాషన్ పిక్స్ తో రచ్చ చేస్తుంది ఈ స్టార్ కిడ్.ఇదిగో అందులో భాగంగానే వదిలిన ఈ పిక్స్ ఇప్పుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి !