E-Paper
Advertisement

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత
Advertisement

HCU Food Poisoning: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU)లో కలకలం రేగింది. యూనివర్సిటీలోని రెండు వేర్వేరు హాస్టళ్లలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురికావడం క్యాంపస్‌లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. రాత్రి భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా సుమారు 42 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

క్యాంపస్ ఆసుపత్రికి తరలింపు

Advertisement

వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో విద్యార్థులు ఇబ్బంది పడటాన్ని గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బాధితులను హుటాహుటిన యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులకు చికిత్స కొనసాగుతుండగా.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆగ్రహం

Advertisement

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనా, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటన జరిగి ఇంతసేపవుతున్నా వైస్ ఛాన్స్‌లర్ గానీ, రిజిస్ట్రార్ గానీ బాధితులను పరామర్శించకపోవడం, పరిస్థితిని సమీక్షించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు.

నాసిరకం ఆహారమే కారణమా?

హాస్టల్ మెస్‌లలో గత కొంతకాలంగా అపరిశుభ్రత తాండవిస్తోందని, విద్యార్థులకు నాసిరకం ఆహారాన్ని వడ్డిస్తున్నారని విద్యార్థి సంఘం ప్రతినిధులు మండిపడుతున్నారు. మెస్ నిర్వహణలో లోపాలు, నాణ్యత లేని సరుకుల వినియోగంపై తాము ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే నేడు విద్యార్థుల ప్రాణాల మీదకు వచ్చిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్ నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: సామాన్యుడికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. ఇక ఆ ధరలకు కళ్లెం పడినట్లే!

Tags

Related News

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!

సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

‘విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారు’.. రాహుల్‌ గాంధీపై కిషన్ రెడ్డి ధ్వజం!

మూడేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు.. ఆ డబ్బు ఏమైంది? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు!

మంత్రులు, సీఎం తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి నిజమేనా? 27న సందీప్ ముందు తేలనున్న లెక్క!

అక్రమ అండాల కేసులో హైకోర్టు సీరియస్.. ఐవీఎఫ్ కేంద్రాల తీరుపై తీవ్ర ఆగ్రహం

ఉపాధి కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

Big Stories

Advertisement
×