E-Paper
Advertisement

గదిలో వర్మ చేసిన పని చూసి షాకయ్యా.. ఆర్జీవీ సీక్రెట్ బయటపెట్టిన శివ నాగేశ్వరరావు!

గదిలో వర్మ చేసిన పని చూసి షాకయ్యా.. ఆర్జీవీ సీక్రెట్ బయటపెట్టిన శివ నాగేశ్వరరావు!
Advertisement

Ram Gopal Varma:సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆలోచనలు, మాటలు, చేసే సినిమాలు అన్నీ మిగతావారి కన్నా భిన్నంగా ఉంటాయన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఎమోషన్స్, కుటుంబ బంధాల గురించి ఆర్జీవీ చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే చాలామంది ఆయనకు అసలు ఎమోషన్స్ ఉండవని దేనికీ బెదరడని అనుకుంటారు కూడా. కానీ అది నిజం కాదని, ఆయనలోనూ సెంటిమెంట్స్, మానవత్వం ఉన్నాయని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు ఇలా బయటపెట్టారు.

Advertisement

రామ్ గోపాల్ వర్మ తండ్రి కృష్ణరాజు చనిపోయినప్పుడు తాను ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నానని, కృష్ణరాజు గారు చనిపోయారనే వార్త తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా ఆర్జీవీ ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆర్జీవీ చాలా ప్రశాంతంగా కనిపించారని, తండ్రి చనిపోయారనే బాధ ఆయన ముఖంలో అస్సలు కనిపించలేదని గుర్తు చేసుకున్నారు.

అయితే ఆ తర్వాత జరిగిన పని చూసి తాను షాక్ అయ్యానని అక్కడున్న వారందరినీ గదిలో నుంచి బయటకు పంపించి, డాక్టర్ల సాయంతో తన తండ్రి కళ్లను దానం చేయించారట వర్మ.ఓవైపు తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉండి కూడా, మరొకరికి చూపునివ్వాలనే గొప్ప ఆలోచనతో ఆయన తీసుకున్న ఆ నిర్ణయం తనకు ఎంతో నచ్చిందని, బయటకు ఎంత కఠినంగా కనిపించినా ఆర్జీవీలోనూ సున్నితమైన మనసు ఉందని వర్మ చేసిన పనితో అర్థమైందని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక ఆర్జీవీతో తన స్నేహం గురించి చెబుతూ తమ ఇద్దరి లైఫ్ స్టైల్ పూర్తిగా వేరైనా ఒకరినొకరు బాగా గౌరవించుకుంటామని చెప్పారు. ఆర్జీవీ మీద ఏదైనా జోక్ వేయాలన్నా ముందు ఆయనకే మెసేజ్ పెట్టి, ఆ తర్వాతే ఫోన్ చేసి చెబుతానని అన్నారు. తనకు డైరెక్టర్‌గా మొదటి ఛాన్స్ ఇచ్చిన నిర్మాతగా వర్మను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని శివ నాగేశ్వరరావు చెప్పారు.

కానీ ఆర్జీవీ మాత్రం, ఒక నిర్మాత ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన జీవితాంతం వాళ్లకు బానిసల్లా ఉండాల్సిన అవసరం లేదని అంటుంటారని, ఆ ఒక్క విషయంలోనే తమ మధ్య చిన్న వార్ జరుగుతుందని చెప్పుకొచ్చారు.ఇక వర్మ దగ్గర పనిచేసిన చాలామంది ఆయన స్టైల్ ఫాలో అవుతారు కానీ, తనకు మాత్రం సినిమాల్లో కామెడీ ఉంటేనే ఇష్టమని చెప్పారు. అందుకే వర్మ తీసిన ‘శివ’ సినిమా కంటే ‘క్షణక్షణం’ సినిమా అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని అన్నారు.

‘శివ’ వంద రోజుల ఫంక్షన్‌లో తనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా గోల్డ్ రింగ్ ఇచ్చారని, కానీ కో-డైరెక్టర్‌గా తనకు ఇంకాస్త పెద్ద గుర్తింపు రావాల్సిందని గుర్తుచేసుకున్నారు. మొత్తానికి ఆర్జీవీ గురించి బయట అనుకునేవి ఏవీ నిజం కాదని మరోసారి తన మాటలతో క్లారిటీ ఇచ్చారు సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు!

ALSO READ:ఖరీదైన వాచ్‌తో జాన్వీ కపూర్ సందడి.. ఫ్యాషన్ లవర్స్ ఫిదా!

Tags

Related News

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లా? విశ్వక్ సేన్ ఏమన్నారంటే!

సెట్‌లో కాస్టింగ్ కౌచ్, దివ్యభారతికి అవమానాలు.. ‘గోట్’ వివాదంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ఖరీదైన వాచ్‌తో జాన్వీ కపూర్ సందడి.. ఫ్యాషన్ లవర్స్ ఫిదా!

విజయశాంతి పాటతో రష్మిక రచ్చ.. మైసాలో అదిరిపోయే సర్‌ప్రైజ్!

చిరంజీవి లేఖతో కదిలిన కేంద్రం.. డీప్‌ఫేక్, మార్ఫింగ్‌పై కొత్త చట్టానికి కిషన్ రెడ్డి సంకేతం

‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ వెనుక అసలు కథ.. టీమ్ ఆన్సర్స్ వింటే నవ్వాల్సిందే!

ఫోన్ స్విచ్ఛాఫ్.. బ్లాక్‌మెయిలింగ్.. గోట్ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది?

Big Stories

Advertisement
×