Fauji film: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavpudi)దర్శకత్వంలో ప్రస్తుతం ఫౌజీ (Fauji)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందాల రాక్షసి, సీతారామం వంటి సినిమాలతో సూపర్ హిట్ చిత్రాలను అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి(Imanvi) సందడి చేయబోతున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా, ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇందులో 1947కు ముందు బ్రిటీష్ సైన్యంలో పనిచేసే భారతీయ సైనికుడి కథను చూపించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సినీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం డైరెక్టర్ అను రాఘవపూడి ఇప్పటికే ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి సంబంధించిన షూటింగ్ మరికాస్త పెండింగ్ లోఉందని, ప్రభాస్ నెల రోజులపాటు కాల్ షీట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. ఇలా దర్శకుడు అనుకున్న విధంగా అన్ని జరిగితే ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 16 వ తేదీ విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకు ప్రీక్వెల్ (Prequel)చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి . ఇలా ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయబోతున్నారంటూ వార్తలు బయటకు రావడంతో అభిమానులు సీక్వెల్, ఫ్రీక్వల్ అంటూ మా హీరోను చాలా ఇబ్బంది పెడుతున్నారని కొంచమైనా తనకు గ్యాప్ ఇవ్వండి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ది రాజా సాబ్ పనులలో ప్రభాస్..
ఇప్పటికే ప్రభాస్ కల్కి 2 , సలార్ 2, సినిమాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో అభిమానులు ఈ విధంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా 2026 జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసే పనిలో చిత్ర బృందం ఉన్నారు. ఈ సినిమాలో రెండు పాటలు అలాగే ఓ 20 రోజులపాటు షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసమే యూరప్ వెళ్ళినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమా పనులలో బిజీ కానున్నారు. ఈ సినిమాలతో పాటు కల్కి 2, సలార్ 2 సినిమాలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Rajamouli: ఇందుకు కదా రాజమౌళి తోపు అనేది.. బాహుబలి కోసం జక్కన్న నటన చూస్తే షాకే!