BigTV English

Rajamouli: ఇందుకు కదా రాజమౌళి తోపు అనేది.. బాహుబలి కోసం జక్కన్న నటన చూస్తే షాకే!

Rajamouli: ఇందుకు కదా రాజమౌళి తోపు అనేది.. బాహుబలి కోసం జక్కన్న నటన చూస్తే షాకే!

Rajamouli: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(S.S.Rajamouli) గురించి పరిచయం అవసరం లేదు. సీరియల్ డైరెక్టర్ గా మొదలైన ఈయన సినీ ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపును తీసుకువచ్చింది. రాజమౌళి తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు కేవలం 12 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అయితే ఈ 12 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇక రాజమౌళి సినీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి(Bahubali) సినిమా ఎలాంటి రికార్డులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉండగా నేడు రాజమౌళి పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో బాహుబలి చిత్రం బృందం ఈయనకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు.


రాజమౌళి గొప్ప నటుడు కూడా…

ఈ వీడియో ద్వారా బాహుబలి సినిమా ఇంత మంచి ఆదరణ సొంతం చేసుకోవడం వెనుక రాజమౌళి కష్టం ఎంత ఉందో స్పష్టంగా చూపించారు.ముఖ్యంగా బిజ్జలదేవా మేకింగ్ సీన్ హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. బాహుబలి సినిమా కోసం జక్కన్న చేసిన ఈ నటన ఎంతో అద్భుతంగా ఉండడమే కాకుండా ఈ సినిమా సక్సెస్ వెనుక రాజమౌళి కష్టాన్ని చూసి అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇందుకే కదా రాజమౌళిని తోపు డైరెక్టర్ అంటూ అందరూ పిలిచేదని కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళిలో కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నటుడు కూడా ఉన్నారు అంటూ మరి కొంతమంది ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

బాహుబలి ది ఎపిక్…

ఇలా బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)పేరుతో మరొక కొత్త సినిమాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 31వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.


ఇలా రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియగానే ఈ సినిమాపై అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనపడుతున్నారు. అయితే ఇందులో కొన్ని కొత్త సన్నివేశాలను కూడా జోడించబోతున్నారని అలాగే కొన్ని సన్నివేశాలను తొలగించబోతున్నట్లు కూడా చిత్రబృందం వెల్లడించారు. మొత్తానికి బాహుబలి ది ఎపిక్ పేరుతో రాజమౌళి సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్నారని చెప్పాలి. ఇక రాజమౌళి తదుపరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం ఎలాంటి అప్డేట్స్ తెలియజేయలేదు.

Also Read: Kantara Chapter1: మొదటి వారంలోనే రూ. 500 కోట్లు.. కుమ్మి పడేస్తున్న కాంతార!

Related News

Skn The Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో ఏడ్చిన ఎస్ కే ఎన్, అసలు ఏం జరిగింది?

Rajamouli: రాజమౌళికి ‘ జక్కన్న’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత స్టోరీ ఉందా?

Kiran Abbavaram : సింపతి అంటే నచ్చదు.. బాధ పెట్టొద్దు అంటూ

Kantara Chapter1 collections : మరి హీనంగా హిట్ అయిన సినిమాకి కూడానా? ప్రేక్షకులు పిచ్చోళ్ళ?

Megastar Chiranjeevi : మాటలు మాత్రమే చెప్పారు, ప్రాజెక్టులు పక్కన పడేసారు

Sithara Naga Vamsi : ఎమోషన్స్‌తో ఆడుకోవడం అలవాటైపోయింది.. అసలు టైం సెన్స్ లేదు

Trisha: పెళ్లే కాదు హనీమూన్‌ డేట్‌ కూడా ఫిక్స్‌… పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్‌

VDKola : రౌడీ సినిమాకు విముక్తి, రాజుగారు రంగంలోకి దిగుతున్నారు

Big Stories

×