Rajagopal Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఎప్పుడూ తిట్టుకోవాలని కొందరి వ్యక్తులు చూస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో నాకు అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని, మంచి జరిగితే మంచి అని.. చెడు జరిగితే చెడు అని చెప్పడం నా నైజం అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
మంత్రి పదవి కోసం నేను రేవంత్ రెడ్డి దగ్గర కాంప్రమైజ్ అయినట్లు కొందరు నాపై ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి పదవి ఇచ్చేది అధిష్టానం రేవంత్ రెడ్డి కాదని అన్నారు. మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చింది అధిష్టానం అధిష్టానం ఏమీ చెప్తే నేను అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. నిదుల కోసం సీఎంను కలిస్తే తప్పేంటి అభివృద్ధి జరగాలంటే సీఎం, డిప్యూటీ సీఎంను కలవాల్సిందనని అన్నారు.
Also read: సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?
కలిస్తే కంప్రమైజ్ కలువకపోతె గ్యాప్ పెరిగిందని ప్రచారం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భిన్నభిప్రాయం ఉండటం సహజం కానీ కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ హార్ట్ అయి ఉంటారు. సీఎంగా వీక్ అయితానని అధిష్టానంతో భాధతో చెప్పుకొని ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కొండా పై అధిష్టానానికి చెప్పుకోవడంలో తప్పేమి లేదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు ఇచ్చేది చిన్న అమౌంట్ ఏమీ కాదని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Also read: త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!