Supreme Court: దిల్లీలో ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో పాల్గొన్న 14 ఏళ్ల మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బాలిక కుటుంబం చేస్తున్న న్యాయపోరాటానికి వ్యతిరేకంగా నిందితుడు బెదిరింపులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు బాధ్యులైనవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని అభిప్రాయపడింది.
బాధిత మైనర్ బాలిక తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన లాయర్.. న్యాయస్థానం ఎదుట కీలక విషయాలను ప్రస్తావించారు. రైట్ వింగ్ ఇన్ ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ (Swatantra Bhardwaj)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి పాపపై తీవ్ర వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. సీజేపీ నిరసనల సమయంలో బాలిక తండ్రిపై దాడి చేశానని భరద్వాజ్ ఒక వీడియోలో బహిరంగంగా అంగీకరించాడని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాలిక నివాసంపై రాళ్లదాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుల ఇల్లు ధ్వంసమైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నత స్థాయి కమిటీ విచారణకు సమయం పడుతుందని, ఈలోగా చిన్నారికి ఏమైనా జరిగితే దాన్ని సరిదిద్దలేమని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై విచారణ జరిపిన సీజేఏ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారిపై హింసకు పాల్పడిన సంఘ విద్రోహ శక్తులు బయట స్వేచ్ఛగా తిరుగుతూ, బెదిరింపులకు దిగడం తీవ్రమైన అంశంగా పరిగణించింది. బాలిక నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని దిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Also Read: ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు
జులై 20న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మైనర్ బాలిక తండ్రి తలపగలగొట్టానని నిందితుడు భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రకటించాడు. తనకున్న రాజకీయ పరిచయాల వల్ల అరెస్టు కాకుండా తప్పించుకున్నానని పేర్కొనడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు వెల్లువెత్తడంతో.. బుల్‌శహర్‌లో భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్ 5న అతడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు నేరపూరిత బెదిరింపుల కింద అదనపు సెక్షన్లు నమోదు చేశారు. అయినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో నిందితుడి నుంచి బాలిక కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Hindutva extremist Swatantra Bhardwaj spoke about attacking the father of a CJP protester during a podcast.
He said that the man received 60 stitches and was on the verge of death, adding that “a Section 307 case was warranted,” yet he walked out within a day after a call from… pic.twitter.com/TqgBEw8Twz
— Sarcastic. (@Sarcaztick) September 2, 2026
Also Read: ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!