Pawan Kalyan Interesting Comments in HHVM Press Meet: హరి హర వీరమల్లు సినిమా అనాథ కాదు, నేను ఉన్నాను.. అంటూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా మూవీ భారీ హైప్ క్రియేట్ చేశాయి. జూలై 24న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉంది. ఇప్పటి వరకు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఏం లేవు. ప్రస్తుతం సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే అంత బజ్ వస్తుంది. కానీ, హరి హర వీరమల్లు టీం ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర స్టేట్స్ లోనూ మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ కానీ నిర్వహించడం లేదు. రాజకీయాల కారణంగా పవన్ ప్రమోషన్స్ కి దూరంగా ఉండటంతో ఈ హరి హర వీరమల్లును పట్టించుకునేవారు లేకుండ పోయారని అంతా అనుకున్నారు.
వీరమల్లు అనాథ కాదు..
కానీ, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పవన్ కళ్యాణ్ ఊహించని ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ(జూలై 21) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీంతో ఈ వెంట్ కు ముందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంట్రీతోనే మూవీపై బజ్ పెంచాడు. ఇక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. హరి హర వీరమల్లు పై ఉన్న అపోహలు, అనుమానాలు తీసేశాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హరి హర వీరమల్లును డైరెక్టర్ క్రిష్ చాలా హై కాన్సెప్ట్ తో తీసుకువచ్చారు. సినిమా కోసం ఎంత కావాలో అంత బెస్ట్ ఇచ్చాం. క్లైమాక్స్ కోసం 56 రోజులు షూట్ చేశాం. మూవీ క్లైమాక్స్ చాలామందిని ఇన్స్పైర్ చేసింది. మొఘల్ సామ్రాజ్యంలో సగటు భారతీయుడు అనుభవించిన బాధ హరిహర వీరమల్లులో చూపించాం’ అని చెప్పుకొచ్చారు.
నిర్మాత వల్లే ఈ ప్రెస్ మీట్
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదన్నారు. నేను యాక్సిడెంటల్ గా యాక్టర్ అయ్యానన్నారు. నిర్మాత ఏఎం రత్నం మౌనం తనని ఈ ప్రెస్ మీట్ పెట్టేలా చేసిందన్నారు. ‘సినిమా కోసం ఏఎం రత్నం ఎన్నో యుద్ధాలు చేశారు. ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి ఆయన. హరి హర వీరమల్లు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. నిర్మాత నలిగిపోతుంటే చాలా బాధ కలిగింది. సినిమా విజయం అనేది పక్కన పెడితే నిర్మాతను కాపాడంలో చాలా ముఖ్యం. ప్రత్యర్థులు నన్ను తిడుతున్నా నిర్మాతగా అండగా ఉండాలని నేనువ చ్చాను. సినిమా నాకు అన్నం పెట్టింది. హరిహర వీరమల్లును ఎన్నో సవాళ్లతో తీశాం. అందరి హీరోల లగే నేను ఒక హీరోని. ఆ హీరోల సినిమాల్లాగా నా సినిమాకు వసూళ్లు రాకపోవచ్చు. కానీ, హరి హర వీరమల్లు అనాథ కాదు.. నేనున్నాను’ అని వ్యాఖ్యానించారు.
క్లైమాక్స్ పతిఒక్కరికి స్ఫూర్తి..
ఇక హరి హర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా క్వాలిటీ మీద తప్ప మరే విషయాల మీద దృష్టి పెట్టలేదు. క్లైమాక్స్ చాలామందికి స్పూర్తిని ఇస్తుంది. మొఘల్ సామ్రాజ్యంలో సగటు భారతీయుడు అనుభవించిన బాధలను హరి హర వీరమల్లులో చూపించాం. మూవీ ప్రీ విజువలైజేషన్ చూశాక నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. థియేటర్లో వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి హరిహర వీరమల్లు మంచి అనుభూతిని ఇస్తుంది. జ్యోతి కృష్ణ మంచి సత్తా ఉన్న దర్శకుడు. మొదటి నుంచి ఆయన ఉంటే అప్పుడే 50 శాతం షూటింగ్ పూర్తయ్యేది. హైకాన్సెప్ట్ తో హరి హర వీరమల్లును తీసుకువచ్చిన దర్శకుడు క్రిష్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఇక సినిమా సినీ పరిశ్రమ సృజనాత్మకతో కూడుకున్న పరిశ్రమ. ఇక్కడ కుల, మత ప్రాంతీయ బేధాలు ఉండవు. ప్రతిభ ఉంటేనే ఇక్కడ ఎవరైనా నిలదొక్కుకుంటారు. అది చిరంజీవి తమ్ముడైనా, కొడుకైరా.. మేనల్లుడైన’ అని పేర్కొన్నారు.