Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు బుచ్చి బాబు సనా (Bucchi babu Sana) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘పెద్ది’ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా నుండి పలు అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తూ ఉండగా.. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అటు మేకర్స్ కూడా ఫుల్ జోష్లో షెడ్యూల్స్ ని కంప్లీట్ చేస్తున్నారు. దీనికి తోడు తాజాగా యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్లు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలుపగా.. సెట్స్ లో చరణ్ నిప్పులు చెరుగుతున్నారని చెబుతూ అంచనాలు పెంచేశారు.
అదిరిపోయే లుక్కులో రామ్ చరణ్..
అంతేకాదు హైదరాబాదులో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లో ఈ సినిమా సన్నివేశాలు తీస్తున్నట్లు.. అందులో రామ్ చరణ్ జీవించేశారు అని.. మరొకసారి రామ్ చరణ్ నటనతో రికార్డు క్రియేట్ చేయబోతున్నారు అని కూడా సినీ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయం నిజం అనేలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చాలా క్లియర్ గా స్పష్టం చేస్తోంది. తాజాగా రామ్ చరణ్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోని రామ్ చరణ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పెద్ది మూవీ కోసం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయ్యిందంటూ రాసుకొచ్చారు. జిమ్ లో తెగ కష్టపడుతూ.. ట్రాన్స్ఫర్మేషన్ లుక్కులో రామ్ చరణ్ దర్శనం ఇచ్చారని చెప్పవచ్చు. లాంగ్ హెయిర్ ముడి వేసుకొని.. గుబురు గడ్డం.. కండలు తిరిగిన దేహంతో అమ్మాయిల హృదయాలు సైతం దోచేస్తున్నారు.
అప్పుడు ధృవ.. ఇప్పుడు పెద్ది..
ఇక ఈ ఒక్క ఫోటో చాలు రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవడానికి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే పెద్ది సినిమాతో తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించి, సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ లుక్ చూసిన చాలామంది అప్పుడు ధ్రువ కోసం ఇలాగే కష్టపడి సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు ఇదే లుక్కుతో కచ్చితంగా పెద్ది సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంటారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
పెద్ది సినిమా విశేషాలు..
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ ఖిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాకు సమర్పకులుగా పనిచేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక వచ్చే యేడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
also read:Hari Hara Veeramallu : రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్న పవన్… చిన్న హీరోల కంటే చాలా తక్కువ ?
Changeover for @PeddiMovieOffl begin!!
Pure grit. True Joy. 💪🏻 pic.twitter.com/trhvrG7wyA
— Ram Charan (@AlwaysRamCharan) July 21, 2025