Harihara Veeramallu : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ఇవాళ గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు జరిగాయి. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు భారీగా వర్షాలు కురుస్తున్నా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు లెక్క చెయ్యకుండా సినిమా హాళ్ల దగ్గర సంబరాలు చేశారు. ప్రీమియర్ షో ముగియడంతో టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..అటు రివ్యూలు కూడా పాజిటివ్ గానే రావడంతో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చేసింది. అయితే ఈ మూవీని ఎందుకు చూడాలి? ఇందులోని ఐదు ప్రధాన అంశాలు ఏవో చూసేద్దాం..
పవన్ కళ్యాణ్ ‘ వీరమల్లు ‘..
ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు.. అందులో ఒకటి హరిహర వీరమల్లు. ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన డిప్యూటీ సీఏం గా బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం ఆయన రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పవన్ సైన్ చేసిన సినిమాలను పూర్తి చేశాడు. అందులో ముందుగా వీరమల్లు మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.. డిప్యూటీ సీఏం గారి సినిమా కావడంతో మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యాక అదే రెస్పాన్స్ ను అందుకుంది.
పవన్ కళ్యాణ్ యాక్షన్…
హరిహర వీరమల్లు’ టైటిల్ కార్డ్ అదిరిపోయిందని అంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ గత సినిమాల పాత్రలతో రూపొందించిన ఈ టైటిల్ కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫస్టాఫ్ చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ బాగుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ కి ముందు వీరమల్లు ఇరగ దీశాడని పోస్టులు పెడుతున్నారు. ఎంఎం కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని అంటున్నారు.. ఓవర్ ఆల్ గా సినిమా పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్- నిధి అగర్వాల్ కెమిస్ట్రీ..
పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని రివ్యూలు చెప్తున్నాయి. డ్యాన్స్, కెమిస్ట్రీ చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర క్యూ కట్టారు.. సినిమా నుంచి విడుదలైన పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.
వీరమల్లు స్టోరీ..
ఈ మూవీ స్టోరీ గురించి రిలీజ్ కు ముందే లీక్ అయ్యింది.. కృష్ణా నదీ తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం దొంగతనానికి గురవుతుంది. అది నెమలి సింహాసనం మీద ఉంటుంది. ఆ సింహాసనం మీద కూర్చున్నది ఔరంగజేబు లాంటి పాలకుడు. అలాంటి ప్రజాకంటకుడు కూర్చున్న నెమలి సింహాసనంపైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని వీరమల్లు కు చెప్తారు. ఆ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి పవన్ చేసిన సాహసాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Also Read: గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
పండగ చేసుకోవాలిగా..!
పవన్ కళ్యాణ్ నుంచి గతంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండి కూడా ఇలాంటి సినిమా చేశారు. ఇది మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా టీజర్ నుంచి మూవీ రిలీజ్ వరకు పొలిటికల్ హీట్ కంటిన్యూ అయింది. సినిమాలో ప్రతిది హైలెట్ గానే నిలిచింది. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. .