BigTV English
Advertisement

OTT Movie : నిద్రలోనే పక్షవాతం తెప్పించి, తినేసే డెవిల్… హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : నిద్రలోనే పక్షవాతం తెప్పించి, తినేసే డెవిల్… హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకి ఒక కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇది నైట్ హాగ్ అనే రాక్షస దెయ్యంను, ఒక సైంటిఫిక్ డాక్టర్ ఎదిరించే సంఘటనలతో రూపొందింది. ఇందులో నిద్రలో ఉన్న మనుషులను బలహీనుల్ని చేసి ఒక దుష్ట శక్తి చంపుతుంటుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ బ్రిటిష్ సూపర్‌న్యాచురల్ హారర్-థ్రిల్లర్ ‘Slumber’. 2017లో విడుదలైన ఈ సినిమాకు జోనాథన్ హాప్‌కిన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో మాగీ క్యూ , క్రిస్టెన్ బుష్, సామ్ ట్రౌటన్, విల్ కెంప్, సిల్వెస్టర్ మెక్‌కాయ్, లూకాస్ బాండ్ నటించారు. ఈ సినిమా 2017లో విడుదలై, అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే ఒటిటి ప్లాట్‌ ఫామ్‌ లలో స్ట్రీమింగ్ అయింది. 1 గంట 24 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 4.7/10 రేటింగ్ పొందింది.


స్టోరీలోకి వెళితే

ఆలిస్ ఆర్నాల్డ్స్ ఒక డాక్టర్ గా విట్టింగ్‌హామ్ స్లీప్ క్లినిక్‌లో పనిచేస్తుంది. ఆమె చిన్నప్పుడు తన తమ్ముడు లియామ్ స్లీప్‌వాకింగ్‌లో మెట్ల మీద నుంచి పడి చనిపోయాడు. దీన్ని అందరూ యాక్సిడెంట్ అన్నారు. కానీ ఆలిస్‌కి అది అనుమానంగా ఉంటుంది. ఆ గాయం ఆమెను వెంటాడుతూ, ఆమెకి కూడా నైట్‌మేర్స్, స్లీప్ పారాలిసిస్ వస్తాయి. ఈ క్రమంలో ఆలిస్ ఒక కుటుంబాన్ని ట్రీట్ చేస్తుంది. ఈ కుటుంబం మొత్తం స్లీప్ పారాలిసిస్‌తో బాధపడుతోంది. ముఖ్యంగా ఆ కుటుంబంలో డానియల్‌కి తీవ్రమైన భయాలు ఉంటాయి. ఒక రాత్రి స్లీప్ స్టడీ సమయంలో అదే కుటుంబానికి చెందిన చార్లీ స్లీప్‌వాకింగ్‌లో డానియల్‌పై దాడి చేస్తాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ ఆలిస్‌కి ఇది సాధారణ సమస్య కాదని అనిపిస్తుంది. ఆలిస్‌కి తన సొంత స్లీప్ పారాలిసిస్ లో ఒక భయంకరమైన రాక్షసి కనిపిస్తుంది. ఆమె శరీరంపై గాయాలు కూడా వస్తాయి.

క్లినిక్ జనిటర్ కామ్ సలహాతో, ఆలిస్ అతని మామ అమాడోని కలుస్తుంది. అమాడో ఒకప్పుడ్డు స్లీప్ ఎక్స్‌పర్ట్. ఆటను నాక్‌నిట్సా అనే పురాతన రాక్షస దెయ్యం గురించి చెబుతాడు. ఇది నిద్రలో ఉన్నవాళ్లను భయపెడుతూ, స్లీప్ పారాలిసిస్‌లో దాడి చేసి, బలహీనమైనవాళ్లను టార్గెట్ చేస్తుంది. ఆలిస్ తన తమ్ముడి మరణం వెనుక కూడా ఇదే రాక్షసి ఉందని తెలుసుకుంటుంది. ఆలిస్ తన సైంటిఫిక్ బిలీఫ్స్‌ని పక్కనపెట్టి, ఈ కుటుంబాన్ని, తన కూతురు నియామ్ ని కాపాడడానికి నాక్‌నిట్సాతో కలసి పోరాడాలని నిర్ణయించుకుంటుంది. ఆలిస్ తన కూతుర్ని, మిగతావాళ్ళని ఆ దుష్ట శక్తి నుంచి కాపాడుతుందా ? ఆ దుష్ట శక్తి వీళ్లంతా బలవుతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Read Also : ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు … ఈ చురకత్తికి పదునెక్కువే… సింగిల్స్ కి మస్త్ స్టఫ్

Related News

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

Big Stories

×