OTT Movie : హారర్ థ్రిల్లర్, ఫ్రెండ్‌షిప్ డ్రామా ఇష్టపడేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఒటిటిలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో దెయ్యం ఆకారంలో ఉండే ఒక రాక్షసుడు చిన్న పిల్లల్ని భయపెట్టి చంపుతుంటాడు. ఎంత ఎక్కువగా భయపడితే చావుకు అంత దగ్గర అవుతున్నట్లే. దీనిని ఎదుర్కోవడానికి ఒక స్నేహితుల టీం పోరాడుతుంది. క్లైమాక్స్ వరకూ ఈ సినిమా భయపెట్టిస్తూనే ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
“IT Chapter One” 2017లో విడుదలైన అమెరికన్ సూపర్‌న్యాచురల్ హారర్ మూవీ. స్టీఫెన్ కింగ్ రాసిన “IT” నవల ఆధారంగా రూపొందింది. దీనికి ఆండీ ముస్కియెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో బిల్ స్కార్స్‌గార్డ్, జాడెన్ మార్టెల్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, సోఫియా లిల్లిస్, జాక్ డైలన్ గ్రేజర్ఎ, జెరెమీ రే టేలర్, వైయాట్ ఒలెఫ్, చోసెన్ జాకబ్స్ నటించారు. ఈ సినిమా 2017 సెప్టెంబర్ 8న థియేటర్లలో విడుదలై నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అయింది. ఇది ఒక దెయ్యం ఆకారంలో ఉన్న రాక్షసుడు పిల్లలను భయపెట్టి హత్యలు చేసే స్టోరీ. 2 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.3/10,Rotten Tomatoes లో 85% రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1988-1989లో అమెరికాలోని డెరీ అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. బిల్ డెన్‌బ్రో అనే 13 ఏళ్ల అబ్బాయి తన తమ్ముడు జార్జీని వర్షంలో కోల్పోతాడు. జార్జీ ఒక కాగితం పడవతో ఆడుకుంటూ ఉండగా, వీధిలోని డ్రైన్‌లోకి పడవ పడిపోతుంది. అక్కడ అతన్ని పెనీవైజ్ అనే క్లౌన్ రూపంలో ఉన్న రాక్షసుడు లోపలికి లాగి హత్య చేస్తాడు. ఈ సంఘటన బిల్‌ని తీవ్రంగా కలచివేస్తుంది. అతను తన తమ్ముడిని వెతకడానికి ప్రయత్నిస్తాడు. బిల్ తన స్నేహితులతో కలిసి “లూజర్స్ క్లబ్” అనే గ్రూప్‌ని ఏర్పాటు చేస్తాడు. ఈ గ్రూప్‌లో రిచీ, ఎడ్డీ, స్టాన్లీ, బెన్, బెవర్లీ, మైక్ ఉంటారు. వీళ్లందరూ డెరీలో పిల్లలు అదృశ్యమవుతున్న ఘటనల గురించి తెలుసుకుంటారు. ఈ పట్టణంలో ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి పిల్లలు అదృశ్యమవుతారని, దీని వెనుక పెనీవైజ్ అనే రాక్షసుడు ఉన్నాడని బెన్ పరిశోధనలో తెలుస్తుంది.
పెనీవైజ్ అనే అతీంద్రియ శక్తి. పిల్లల భయాలను ఉపయోగించి వాళ్లను చంపుతుంటాడు. ముఖ్యంగా క్లౌన్ రూపంలో వచ్చి వాళ్లను హత్య చేస్తాడు.లూజర్స్ క్లబ్‌లోని ప్రతి పిల్లవాడు తమ భయాలతో ఆ రాక్షసున్ని ఈదుర్కొంటారు. బెవర్లీ తన తండ్రి నుంచి, ఎడ్డీ తన అనారోగ్య భయాల నుంచి, స్టాన్లీ మతపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడాలని పోరాడతారు. అయితే ఈ లూజర్స్ క్లబ్ స్నేహంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. వాళ్లు పెనీవైజ్‌ని ఎదిరించడానికి డెరీలోని సీవర్‌లలోకి వెళతారు. సీవర్‌లలో లూజర్స్ క్లబ్ పెనీవైజ్‌తో గట్టిగా పోరాడుతుంది. వాళ్లు తమ భయాలను అధిగమించి, పెనీవైజ్‌ని బలహీనపరుస్తారు. బిల్ తన తమ్ముడు జార్జీ గురించిన గిల్ట్‌ని ఎదుర్కొని, పెనీవైజ్‌కి భయపడకుండా ధైర్యంగా నిలబడతాడు. చివరికి ఈ లూజర్స్ క్లబ్ ఆ రాక్షసున్ని అంతం చేస్తారా ? దాని చేతిలో బలవుతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మూడడుగుల పొట్టోనికి అందగత్తెతో పెళ్ళి… రాత్రయితే నరకమే… వీడు చేసే పని చూస్తే ఫ్యూజులు అవుట్