Kavitha wishes to KTR: కేసీఆర్ కుటుంబంలో విబేధాలు సమిసిపోయాయా? ఎప్పటి మాదిరిగా ఫ్యామిలీ సభ్యులు ఒకేతాటిపైకి వచ్చారా? ఇన్నాళ్లు ఆ ఫ్యామిలీలో జరిగింది కేవలం ఊహాగానాలేనా? పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య కేటీఆర్‌కు కవిత స్వయంగా శుభాకాంక్షలు చెప్పారు. దీనిపై వివిధ పార్టీల నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు.
రాజకీయాలు వేరు.. పర్సనల్ లైఫ్ వేరు. కానీ మారిన రాజకీయాల నేపథ్యంలో రెండింటినీ ఒకే గాడిన కడుతున్నారు పార్టీల నేతలు. జులై 14న కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు చాలామంది రాజకీయ నేతలు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు.
అయితే కేటీఆర్ ఫోన్ ఎంగేజ్ వచ్చింది. దీంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. వారిలో కేటీఆర్ చెల్లి కవిత కూడా ఒకరు. ఎక్స్ వేదికగా అన్నయ్య కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే కేటీఆర్‌కు స్వయంగా పుట్టినరోజులు శుభాకాంక్షలు కవిత చెప్పడంపై తెలంగాణ అంతటా చర్చ మొదలైంది. అన్న-చెల్లి మధ్య సంబంధాలు సరిగా లేవని వార్తల నేపథ్యంలో కవిత శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: ఇంటర్ స్టూడెంట్స్ కు ఓ కార్డు, మళ్లీ ఇదేంటి?
తన సోదరుడు కేటీఆర్‌కు కవిత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అన్నా-చెల్లి మళ్లీ కలిసిపోయారా? వీరిద్దరి మధ్య విభేదాలు సమిసిపోయినట్టేనా? వీరిద్దర్ని కలిపిందెవరు? ఆరా తీయడం ప్రత్యర్థుల వంతైంది. కొన్నాళ్లు కిందట పార్టీ విధానాలను విమర్శిస్తూ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు కవిత. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలీదు. తర్వాత ఆ వ్యవహారంపై పెద్ద రచ్చ సాగింది.
కొంతకాలంలో పార్టీ వ్యవహారశైలిని కవిత విమర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. ఇదే సమయంలో కవిత వ్యాఖ్యలను తప్పుబట్టారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మాటల యుద్ధం నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడి చేసిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో సభ్యత్వాలు రద్దు చేయాలంటూ ఒకరిపై మరొకరు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసుకున్నారు. జరిగిన రచ్చపై కనీసం బీఆర్ఎస్ పెద్దలు ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. దీంతో కవితను దూరంగా పెట్టారన్న వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. తాజాగా కవిత ఎక్స్ వేదికగా కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పడం కొసమెరుపు. ఇంతకీ అన్నా-చెల్లి మధ్య విభేదాలు ముగిసినట్టేనా?
Annayya
Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025