Suriya-Venky Atluri Movie First Look: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ వదులుతూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఇప్పటికే ఆయన నటిస్తున్న కరుప్పు మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కాగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం పూజ కార్యక్రమాన్ని జరుపుకుని గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్
దశబ్ధాలుగా సూర్య తెలుగు ఆడియన్స్ కి పరిచయం. డబ్బింగ్ చిత్రాలతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆయన సినిమాలకు ఇక్కడ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. దీంతో ఆయన తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ, ఇప్పటి వరకు సూర్య నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా రాకపోవడం అభిమానులను బాధించే విషయం ఇది. అయితే ఈసారి నేరుగా తెలుగు ఫ్యాన్స్ పలకరించేందుకు వెంకీ అట్లూరితో జతకట్టాడు. ఆయన దర్శకత్వంలో సూర్య 46వ చిత్రం తెరకెక్కతోంది. అయితే ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి సూర్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.
సూర్య 46 ఫస్ట్ లుక్
ఆయన లుక్ వింటేజ్ లుక్ వింటేజ్ సూర్యని గుర్తు చేస్తోంది. నువ్వు నేను ప్రేమ, గజిని సినిమాలను గుర్తు చేస్తున్నాడు. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ సూర్యకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘మా ప్రియమైన సూర్య గారికి అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అభిరుచి, ఉనికి ప్రతి ఫ్రేమ్‌ను వెలిగిస్తుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది మూవీ టీం. అలాగే వింటేజ్ సూర్యను చూపించేందుకు మేము చాలా ఆసక్తిగా ఉన్నామంటూ మూవీపై బజ్ పెంచారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. కాగా సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Pawan Kalayn HHVM : వీరమల్లు ఫ్లెక్సీని చింపేశారు… పవన్ కళ్యాణ్‌కు కర్ణాటకలో బిగ్ షాక్
కీలక పాత్రలో బాలీవుడ్ నటి
అంతేకాక.. తమిళ స్టార్ హీరోలతో వెంకీ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. సార్ తో ధనుష్ కి, లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో భారీ హిట్స్ ఇచ్చిన వెంకీ ఈసారి సూర్య కోసం భారీగా ప్లాన్ చేసి ఉంటాడని అభిమానులంత గట్టిగా నమ్ముతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి వస్తున్న 84వ చిత్రమిది. ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేం మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ముందుకు వెళుతోంది.
Wishing the one and only, never-aging and forever young, Our dearest @Suriya_offl garu a fantastic birthday! 🤩 – Team #Suriya46
Your passion and presence light up every frame. 🌟#HBDSuriyaSivakumar #HappyBirthdaySuriya #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/l2mcm1RuZW
— Sithara Entertainments (@SitharaEnts) July 23, 2025