Why HHVM Feels Under Rated: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. మొన్నటి వరకు పెద్దగా బజ్ లేని ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి కారణం జనసేనాని. పవన్ ఎంట్రీతో హరి హర వీరమల్లు అంచనాలు రెట్టింపు అయ్యాయి. తెలుగులో రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ పెరిగింది. సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆడియన్స్, ఫ్యాన్స్ దృష్టిని హరి హర వీరమల్లు వైపుకు తిప్పాడు. అసలు ప్రమోషన్స్ కే రాడు అనుకున్న పవన్.. వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
వీరమల్లుని ఆడియన్స్ తక్కువ అంచన వేశారు
ప్రెస్ మీట్స్, బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్య్వూలతో ఫుల్ బిజీ అయిపోయారు. మీడియా ఛానళ్లతో ముచ్చటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా యూట్యూబర్స్ తో ఇంటారాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా తన మిగతా సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు ఉన్నంత బజ్.. హరి హర వీరమల్లుకు ఎందుకు లేదు? అని ఓ యూట్యూబ్ ప్రశ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. సినిమా విషయంలో ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి మారింది. ఆడియన్స్ అంత యాక్షన్, గ్రే షేడెడ్ సినిమాలు చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే హరి హర వీరమల్లు మూవీని తక్కువ అంచనా వేస్తున్నారు.
తొలి పాన్ ఇండియా చిత్రం
కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రమిది. అంతేకాదు ఆయన తొలి పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ మూవీ. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ 16వ శతాబ్ధానికి చెందిన పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు. మెఘల్ సామ్రాజ్యంలోని అత్యంత క్రూరుడైన ఔరంగజేబు పాలనతో భారతీయులు ఎలాంటి కష్టాలు పడ్డారు, అతడి అరచకాల నుంచి వీరమల్లు తన ప్రజలను ఎలా రక్షించుకున్నాడనేది హరి హర వీరమల్లు నేపథ్యం. ఇందులో పవన్ సరసర నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి కథానాయకుడిగా కనిపించాడు.
ఇందులో ఆయనది ఔరంగ జేబు పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ముందు నుంచి మంచి బజ్ ఉన్న ఈ సినిమాపై లాక్ డౌన్ తర్వాత అందరిలో అంచనాలు మారిపోయాయి. డైరెక్టర్ల మారడంతో ఈ సినిమా కథను ఎవరూ నమ్మడం లేదు. మూవీ అవుట్ పుట్ విషయంలో ఎన్నో సందేహాలు. దీంతో హరి హర వీరమల్లును కొనేందుకు బయ్యర్ల ఎవరూ ముందుకు రాలేదు. ఇక ట్రైలర్ తర్వాత మూవీపై హైప్ పెరిగింది. దీంతో మూవీ రైట్స్ తీసుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చిన బేరాల దగ్గర ఆగిపోయింది. అన్ని ఏరియాల్లో బయ్యర్ల కొరత, థియేటర్ల సమస్య తలెత్తింది. ఈ విషయంలోనూ స్వయంగా పవన్ కలుగజేసుకుని వారితో చర్చిడంతో ఈ సమస్య తొలిగిపోయింది.
Also Read: Adivi Sesh Dacoit Movie : షూటింగ్ సెట్ లో ప్రమాదం.. హీరో, హీరోయిన్‌కు గాయాలు