Hari Hara Veera Mallu Nizam Bookings Update: స్టార్ డైరెక్టర్, అగ్ర నటుడు.. పాన్ ఇండియా మూవీ.. భారీ బడ్జెట్ చిత్రం.. అయినా ’హరి హర వీరమల్లు‘కు రిలీజ్ కష్టాలు తప్పలేదు. సినిమా రిలీజ్ చేయాలంటే మూవీ టీం పెద్ద యుద్దమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మూవీకి మొదట బయ్యర్లు లేక మూవీ టీం చుక్కలు చూసింది. ఇక ట్రైలర్ విడుదలతో సినిమాపై హైప్ పెరిగింది. దీంతో మూవీని కొనేందుకు ఒక్కొక్కరు ముందుకు వచ్చారు. అలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేసింది. అయితే మొదటి నుంచి మూవీ టీం వెంటాడుతున్న సమస్య నైజాం ఏరియా. వసూళ్లు అత్యధిక మొత్తం ఈ ఏరియా నుంచే వస్తాయి.
నైజాం లో థియేటర్ల సమస్య?
అత్యంత కీలకమైన నైజాంలో సినిమాకు బయ్యర్లు కరువవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. అక్కడ నిర్మాత పలికిన ధరకు కాకుండా.. బేరాలకు దిగారు. మొదట కొత్త బయ్యర్ల చేతికి వెళ్లిన ఈ సినిమా ఎన్నో చర్చల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక సినిమాకు అక్కడ ఎలాంటి అడ్డంకులు లేవని మూవీ రిలాక్స్ అయ్యింది. మూవీ రిలీజ్ కు ఇంకా రెండు రోజులే ఉంది. కానీ, ఇంకా నైజాంలో బుకింగ్స్ ఒపెన్ కాకపోడం కలవరపెడుతోంది. పాన్ ఇండియా సినిమా అంటే కొన్ని రోజుల ముందే బుక్కింగ్స్ ఒపెన్ చేస్తారు. నైజాం లాంటి ఏరియా కాస్తా ఎర్లీగానే బుకింగ్స్ ఒపెన్ అవుతాయి. కానీ, హరి హర వీరమల్లు సినిమా విషయంలో నైజాంలో ఇంకా థియేటర్ల సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం కాస్తా పవన్ దృష్టికి వెళ్లడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించినట్టు తెలుస్తోంది.
సాయంత్రంలోగా బుకింగ్స్ ఒపెన్
దీంతో నైజాంలో కదలిక మొదలై థియేటర్ల వివాదం సద్దుమనిగినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే నైజాంలో బుక్కింగ్స్ ఒపెన్ అంత సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి నైజాంలో బుక్కింగ్స్ ఒపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోందట. కాగా మొదటి నుంచి హరి హర వీరమల్లు విషయంలో పవన్ నిర్మాతకు అండగా నిలుస్తున్నారు. సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ ని కూడా తన భుజాన వేసుకున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వీరమల్లు ప్రమోషన్స్ లేకపోవడంతో అభిమానుల నిరాశ గురయ్యారు. రాజకీయాల వల్ల పవన్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే.
ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ సందడి
కనీసం.. నిర్మాతైన వీరమల్లు వరుస ఈవెంట్స్, ప్రమోషన్స్ తో సందడి చేస్తాడనుకున్నారు. ఈ విషయంలో ఆయన సైలెంట్ గా ఉండటంతో ఏకంగా పవన్ రంగంలోకి దిగారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కొన్ని గంటల ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. హరి హర వీరమల్లు అనాథ కాదు.. నేనున్నాను మూవీపై విపరీతమైన బజ్ పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా తన భార్యతో కలిసి హజరై సందడి చేశారు. నిర్మాత మౌనం కారణంగా తాను ప్రమోషన్స్ కి రాకతప్పలేదన్నారు. జనసేననాని రాకతో వీరమల్లు విపరీతమైన బజ్ పెరిగింది. అభిమానులంత ఆయన రాకతో సంబరాలు చేసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ సంఖ్యలో హాజరైన ఫుల్ హడావుడి చేశారు. మెగా ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హరి హర వీరమల్లు అంచనాల మరింత రెట్టింపు అయ్యాయి. మూవీ కవాల్సినంత బజ్ పవన్ ఇచ్చాడని, ఇక జూలై 24న వీరమల్లు బాక్సాఫీసు వద్ద వసూళ్లు, రికార్డుల మోత మోగించడమే మిగిలి ఉందని అభిమానులంత కాలర్ ఎగిరేస్తున్నారు.
Also Read: Don 3: డాన్ 3.. విజయ్ దేవకొండ స్థానంలో బిగ్ బాస్ విజేతను.. అసలేమైందంటే..