Vijay Devarakonda Replaced With Bigg Boss Winner in Don 3: బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత ఫర్మాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాన్ 3’. ప్రకటనతోనే ఈ చిత్రం బజ్ క్రియేట్ చేసింది. ఇంకా నటీనటులు ఫిక్స్ కాలేదు, షూటింగ్ అప్డేట్ కూడా లేదు. ఇంక ఈ సినిమా చర్చల దశలోనే ఉంది. కానీ, ఈ సినిమాకు సంబంధించిన రోజులో వార్త సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. ఇప్పటికే కింగ్ ఖాన్ షారుక్ స్థానంలో రణ్ వీర్ ని ప్రకటించడంతో ఈ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మొదటి రెండు సీజన్లలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా చేశాడు.
షారుక్ ని కాదని రణ్ వీర్ తో..
అయితే మూడో భాగంలోనూ షారుక్ హీరో అని అభిమానులంత అనుకున్నారు. కానీ, ఆయన స్థానంలో ఫర్హాన్.. రణ్ వీర్ సింగ్ ని ప్రకటించారు. అప్పటి నుంచి సినిమాను ఉద్దేశిస్తూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మారోసారి డాన్ 3 మూవీ వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో విలన్ గా మొదట బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సేను తీసుకున్నారు. కానీ కియేటివ్ డిఫరెన్సెస్, పాత్ర డిజైన్ నచ్చకపోవడంతో విక్రాంత్ ఈ సినిమా చేయనని చెప్పాడట. దీంతో విలన్ పాత్ర నుంచి విక్రాంత్ తప్పుకోవడంతో ఫర్హాన్ మన టాలీవుడ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి.
విజయ్ స్థానంలో బిగ్ బాస్ విన్నర్
ఈ విషయమై మూవీ టీం విజయ్ ని కూడా సంప్రదించింది. దీంతో డాన్ 3 లో విజయ్ నటిస్తున్నాడంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ, తన బిజీ షెడ్యూల్ కారణంగా విజయ్ కూడా ఈ పాత్ర నుంచి తప్పుకున్నాడట. ఈ నేపథ్యంలో మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది. విజయ్ స్థానంలో బిగ్ బాస్ విజేతను తీసుకున్నట్టు బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అతడు మరెవరో కాదు హిందీ బిగ్ బాస్ 18వ సీజన్ విన్నర్ కరణ్ వీర్ మెహ్రాన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. ఇటీవల కరణ్ ఫర్హాన్ ఆఫీసులో కనిపించడంతో అంత డాన్ 3 విలన్ ఫిక్స్ అయ్యాడని, రణ్ వీర్ ఢీ కొట్టేది కరణ్ వీర్ అంటూ బాలీవుడ్ మీడియాల్లో తెగ ప్రచారం జరిగింది.
డైలామాలో ఫర్హాన్..
దీంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇందులో అతడు మెయిన్ విలన్ కాదని తెలుస్తోంది. మరో లో పాత్రకు కరణ్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డాన్ 3 మూవీ ఎప్పుడెప్పుడ లాంచ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కి తరచూ నిరాశే ఎదురౌవుతోంది. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కాకపోవడం.. ముఖ్యంగా ఇందులో మెయిన్ విలన్ రోల్ కి పాత్ర ఫర్హాన్ కు సవాలుగా మారింది. ఎందుకో తెలియదు ఈ రోల్ కోసం సంప్రదించిన స్టార్ నటులంతా అనసక్తి చూపిస్తున్నారట. ఇటీవల విలన్ గా ఆదిత్య రాయ్ కపూర్ ని కూడా ఫర్హాన్ సంప్రదించారట. కానీ, అతడు కూడా ఈ రోల్లో నటించనని చెప్పేశాడట. ఇక కరణ్ వీర్ ఒకే అయ్యాడనుకుంటే అతడిది మెయిన్ విలన్ రోల్ కాదని తెలుస్తోంది.