Mass Jathara Update: అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ మొదలుపెట్టిన రవితేజ నటుడుగా కూడా అడుగులు వేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణంలో దర్శకుడు పూరి జగన్నాథ్ నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తా అని రవితేజతో పలుమార్లు అంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ విషయాన్ని పెద్దగా నమ్మలేదు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం అనుకున్నట్లుగానే రవితేజ హీరోగా పెట్టి సినిమాలు చేశారు.
రవితేజ ఎంతమంది తో సినిమాలు చేసినా కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ చేసే సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఉంటుంది. వీరిద్దరికీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. రవితేజ సినిమాల ప్రస్తావన వస్తే మొదటి గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించినవే. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
మాస్ జాతర అప్డేట్
రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా విడుదల చేశారు. అయితే ఒకప్పుడు రవితేజకు చక్రీ పాడిన పాటలు మంచి సక్సెస్ గా ఉండేవి. చక్రి కూడా మంచి మ్యూజిక్ ను రవితేజ సినిమాలకు అప్పట్లో అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదలైన పాట కూడా చక్రీ వాయిస్ లోనే చాలామందికి వినిపిస్తుంది. ప్రస్తుతం మాస్ జాతర షూట్ జరుగుతుంది. విలన్ సీన్స్ తీస్తున్నారు. ఆగస్ట్ మొదటి వారంలో నాలుగు రోజులు సాంగ్ షూట్ జరగనుంది. దాంతో టోటల్ షూట్ కంప్లీట్ అవుతుంది. దీనిని బట్టి రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో త్వరలో అనౌన్స్ చేస్తారు.
ధమాకా తర్వాత హిట్ లేదు
రవితేజ హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరియర్లో ముందుకు వెళ్తున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా తర్వాత ఇప్పటివరకు రవితేజకు ఊహించిన సక్సెస్ రాలేదు. ఆ సినిమా తర్వాత రవితేజ హీరోగా మూడు సినిమాలు చేశారు. ఆ మూడు సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ చిరంజీవితో పాటు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. కానీ ఆ సినిమాలో రవితేజ ది కేవలం అతిథి పాత్ర కాబట్టి ఆ క్రెడిట్ రవితేజకు ఇవ్వలేం. అయితే ప్రస్తుతం మాస్ జాతర సినిమా మీద మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా నాగ వంశీ కూడా మాట్లాడుతూ ఈ సినిమా పైన తన నమ్మకాన్ని తెలియజేశాడు.. కొంతమంది హీరోలు కొన్ని చేస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు. రవితేజ గారు ఈ సినిమాలో అలానే ఉండబోతున్నారు అంటూ నాగ వంశి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read: OG First Single : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు, ఓజి ఫస్ట్ సింగిల్ అప్పుడే