Hari Hara Veera Mallu: ప్రముఖ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా.. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu). పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈరోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ నిర్వహిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారికంగా వెలువడలేదు. అయితే ఇప్పుడు మాత్రం హరిహర వీరమల్లు సినిమా మేకర్స్ తాజాగా గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పలు విషయాలను పంచుకుంటూ ఉండగా.. అందులో భాగంగానే మరొకవైపు ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి.
చిన్న హీరో కంటే తక్కువ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్..
ఇదిలా ఉండగా దాదాపు రెండేళ్ల తర్వాత సినిమా చేస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న తొలి సినిమా కావడంతో.. అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఏఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటూ వార్తలు రాగా ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నారట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న హీరో స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏంటి అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
లాభాల్లో వాటా ఉంటుందా?
అయితే ఇక్కడ తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అడ్వాన్స్ గా మాత్రమే ఈ 8 కోట్ల రూపాయలు తీసుకున్నారని.. సినిమా రిలీజ్ అయ్యాక నిర్మాతకు వచ్చే లాభాలను బట్టి మిగతా రెమ్యూనరేషన్ ఉంటుంది అని సమాచారం.ఇక దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం రత్నం వారసుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా నుండీ ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
also read:LIK Film: వాయిదా పడ్డ ప్రదీప్ రంగనాథన్ మూవీ.. కొత్త డేట్ ఎప్పుడంటే?