LIK Film: అచ్చం ధనుష్ (Dhanush) లాంటి కటౌట్ తో ఇండస్ట్రీలో వైరల్ అయిన మరో హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. సౌత్ ఇండస్ట్రీలో ధనుష్ కి ఎంతటి గుర్తింపు ఉందో అంతటి గుర్తింపును సంపాదిస్తున్నారు ప్రదీప్ రంగనాథన్..ఒకప్పుడు ధనుష్ కూడా ఇలాగే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు లవ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారారు. ఇప్పుడు ప్రతి ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కూడా సేమ్ టు సేమ్ ధనుష్ లాగే ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ నటించిన రెండు, మూడు సినిమాలు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హిట్ అవ్వడంతో ఈయనకి తెలుగు ఇండస్ట్రీలో కూడా అభిమానులు అయ్యారు. అలా యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోతున్న ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న తాజా మూవీ ఎల్ఐకే(LIK) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ..
LIK మూవీ విడుదల తేదీ వాయిదా..
అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక షాకింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..ఈ సినిమాని సెప్టెంబర్ 18న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. కానీ సడన్ గా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏంటి.. సినిమా ఎప్పుడు రాబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం..
కొత్త డేట్ ఎప్పుడంటే..
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ సెప్టెంబర్ 18న వాయిదా పడి.. వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య (S.J.Surya),యోగి బాబు (Yogi Babu), మిస్కిన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
LIK మూవీ విశేషాలు..
నయనతార (Nayanthara) భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి(Kriti Shetty) హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా మూవీ ‘ఎల్ ఐ కే – లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Love Insurance Kompany).. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లో నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ (SS Lalith Kumar)లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravichandran)సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండీ కృతి శెట్టి , ప్రదీప్ రంగనాథన్ కాంబోలో ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.ఈ సాంగ్ ని విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) రాయగా.. అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravichandran) తన మ్యూజిక్ డైరెక్షన్ లో స్వయంగా పాడారు.
ప్రదీప్ రంగనాథన్ సినిమాలు..
ప్రదీప్ రంగనాథన్ సినిమాల విషయానికి వస్తే..లవ్ టుడే(Love Today), డ్రాగన్(Dragon), కోమలి(Comali) వంటి సినిమాలతో ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈయనకి లవ్ టుడే మూవీ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ కూడా బ్లాక్ బస్టర్ అయింది.
also read:Mohan Babu: కోటా కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు.. ఆప్తుడి మరణం భరించరానిదంటూ కన్నీళ్లు!